జగిత్యాల జగడం..జీవన్ రెడ్డికి పట్టు దొరికిందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుల్లో జీవన్ రెడ్డి ఒకరు. నాలుగు దశాబ్దాల నుంచి తెలంగాణల రాజకీయాలు చేస్తున్న జీవన్ రెడ్డికి జగిత్యాల నియోజకవర్గంలో పలుమార్లు సత్తా చాటారు. 1983లోనే ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి జగిత్యాల బరిలో గెలిచారు. అప్పుడే ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు దూరం జరిగిన జీవన్ రెడ్డి..కాంగ్రెస్ లోకి వచ్చారు.

 

 

ఆ తర్వాత 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక 1989లో గెలిచిన ఈయన..1994 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 1996 ఉపఎన్నిక, 1999, 2004 ఎన్నికల్లో గెలిచారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో మరొకసారి గెలిచారు. కానీ 2018 ఎన్నికల్లో ఎప్పుడూలేని విధంగా 61 వేల ఓట్ల మెజారిటీతో జీవన్ రెడ్డి..బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధి సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. కవిత సపోర్ట్ తో సంజయ్ సత్తా చాటారు.

 

అయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి జీవన్ రెడ్డి సత్తా చాటారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఈయన జగిత్యాల బరిలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అక్కడ రాజకీయ సమీకరణాలు చూస్తే బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కు అంత అనుకూలమైన వాతావరణం ఏమి లేదు.ఈ సీటులో నెక్స్ట్ కవిత పోటీ చేస్తుందనే ప్రచారం ఉంది. మరి ఈ సీటు నుంచి బి‌ఆర్‌ఎస్ తరుపున సంజయ్ పోటీ చేస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఇటు కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి రెడీగా ఉన్నారు. అటు బి‌జే‌పి నుంచి ముదుగంటి రవీందర్ రెడ్డి పోటీ చేయనున్నారు.

అయితే జగిత్యాలలో బి‌జే‌పి బలం తక్కువే..గత ఎన్నికల్లో బి‌జే‌పికి 4 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇప్పుడు కొన్ని ఓట్లు పెరగవచ్చు గాని గెలిచే ఛాన్స్ లేదు. ప్రధాన పోటీ బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ ల మధ్యే. అయితే జీవన్ రెడ్డిపై సానుభూతి ఉంది..మళ్ళీ రాష్ట్రంలో కే‌సి‌ఆర్ గాలి లేకుండా ఉంటే..జీవన్ రెడ్డికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సారి జీవన్ రెడ్డి గెలుస్తారో? లేదో?