పోటీకి సై అంటూనే పెద్దాయన కండీషన్స్ పెట్టారా

-

సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇక అందరికంటే ముందే స్పీడు పెంచి అభ్యర్ధిని ప్రకటించింది హస్తం పార్టీ. జానారెడ్డికి కూడా వ్యక్తిగతంగా ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. గత ఎన్నికల్లో ఓటమి నేర్పిన పాఠమో ఏమో ఈ సారి పదునైన ప్యూహాలతో కార్యక్షేత్రంలో దిగుతున్నారట..ప్రచార ప్యూహలు రుపోందిస్తున్న పెద్దాయన సొంత పార్టీకి కూడా కొన్ని కండీషన్లు పెట్టారట..వీటి పై కాంగ్రెస్ లోనే ఆసక్తికర చర్చ నడుస్తుంది.

నాగర్జునసాగర్ ఉప ఎన్నిక వేళ సీనియర్ నేత జానారెడ్డి పోటీకి సంసిద్దత వ్యక్తం చేస్తూనే అధిష్టానానికి పలు కండీషన్లు పెట్టారట..అందులో భాగంగా పీసీసీ చీఫ్ ఎంపిక కూడా ఉప ఎన్నిక వరకు వాయిదా పడింది. అలాగే ఇప్పుడిప్పుడే ప్రచారానికి సన్నద్దమవుతున్న వేళ సొంత పార్టీ నేతలతో కూడా జానారెడ్డికి సమస్యలొస్తున్నాయట.నియోజకవర్గంలో ఓటర్లను కలుస్తున్న పెద్దాయన తనకు ప్రచారం చేసేందుకు నేతలెవరు అవసరం లేదనే మెసేజ్ అధిష్టానికి చెరవేశారనే ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో తలో దిక్కుగా విడిపోయారు టీ కాంగ్రెస్ నేతలు. ప్రచారంలోకి వచ్చి వారేదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అది తన మెడకు చుట్టుకుంటుందన్న భయం జానారెడ్డిలో ఉంది. అందుకే ముఖ్యమైన నేతలతో నిర్వహించే బహిరంగ సభలకే వారిని హాజరయ్యేలా చూడాలని జానారెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారట. టీ కాంగ్రెస్ లో కీలక నేతలుగా ఉన్న రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, వి.హనుమంతరావు, మధు యాష్కి వంటి నేతలు ప్రచారానికి రాకుండా ఉంటేనే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారట జానారెడ్డి.

ఈ నేతలంతా దూకుడు స్వభావం ఉన్న నేతలు..వీరు కదనోత్సహాంతో చేసే వ్యాఖ్యలు లాభం కంటే నష్టం ఎక్కువ చేస్తాయని ఉత్తమ్,భట్టీలా కాస్త సంయమనంతో వ్యవహరించే నేతలు ప్రచారంలో ఉంటే బెటర్ అని పెద్దాయన భావిస్తున్నారట. ఈ స్థానం నుంచి ఏడుసార్లు విక్టరీ కొట్టిన జానారెడ్డి 8వ సారి గెలిచేందుకు పూర్తిస్థాయి అస్త్రశస్త్రాలతో సిద్దమవుతున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ స్థానిక నాయకులందరినీ కలుపుకుపోయే పనిలోలో ఉన్నారట..చూడాలి పెద్దయన ప్యూహం ఏమెరకో ఫలిస్తుందో…

Read more RELATED
Recommended to you

Latest news