కాకినాడలో ఒకేసారి టీడీపీ, జనసేన పార్టీల‌కు దిమ్మ తిరిగే దెబ్బ‌..!

-

సార్వత్రిక ఎన్నికల త‌ర్వాత ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుసగా పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అధికార‌ప‌క్ష‌ వైసీపీలోకి ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. మ‌రియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యేందుకు మరికొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. కాకినాడ‌లో టీడీపీ మ‌రియు జ‌న‌సేన పార్టీల‌కు ఒకేసారి దిమ్మ తిరిగే దెబ్బ త‌గిలింది.

మాములుగా పార్టీకు చెందిన కీలక నేతలు పార్టీలు మారడం ఏమో కానీ కాకినాడలో మాత్రం ఒకేసారి జనసేన మరియు టీడీపీకు చెందిన స్థానిక నేతలతో పాటుగా దాదాపు 500 మందికి పైగా కార్యకర్తలు వైసీపీ తీర్ధం పుచ్చుకుని భారీ షాక్ ఇచ్చారు. జనసేన పార్టీ నేతలు కురమళ్ల రాంబాబు, సురవరపు సురేష్‌, టీడీపీ మహిళా నాయకురాలు వర్ధినీడి సుజాత, నాయకులు సింగంపల్లి బాబురావు, తడాల సత్యనారాయణతో పాటు 500 మంది వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వారికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news