జనసేన: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల బలం నిదానంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలోఅటు టిడిపి, జనసేనల బలం పెరుగుతుంది. టిడిపి దూకుడుగా వెళుతుంటే..కొన్ని సీట్లలో జనసేన హవా కనిపిస్తుంది. జనసేన బలం పెరిగినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన బలం పెరిగిందని తెలుస్తోంది. ఇక్కడ జనసేనకు ఆధిక్యం ఉందని తెలుస్తోంది.
అయితే మొదట నుంచి నరసాపురం టిడిపి కంచుకోట..1983 నుంచి 2004 వరకు వరుసగా అక్కడ టిడిపి జెండా ఎగిరింది. కానీ 2009లో ప్రజారాజ్యం వల్ల ఓట్లు చీలిపోయి టిడిపికి నష్టం జరిగింది. అప్పటివరకు టిడిపికి మద్ధతుగా ఉన్న కాపులు ప్రజారాజ్యం వైపుకు వెళ్లారు. ఓట్ల చీలికతో అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. 2014లో టిడిపికి జనసేన సపోర్ట్ ఇవ్వడంతో..టిడిపి విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేయడంతో మళ్ళీ ఓట్లు చీలిపోయి వైసీపీ గెలిచింది.
అయితే ఈ సారి వైసీపీ గెలిచింది..జనసేన పై..అక్కడ టిడిపి మూడోస్థానానికి పరిమితమైంది. వైసీపీకి దాదాపు 55 వేల ఓట్లు వస్తే..జనసేనకు 49 వేల ఓట్లు పడ్డాయి. ఇక టిడిపికి 27 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అక్కడ నిదానంగా వైసీపీకి యాంటీ పెరుగుతుంది..ఇదే సమయంలో జనసేన బలపడుతుంది. జనసేనకు కీలకమైన కాపు వర్గంతో పాటు మత్స్యకార వర్గం సపోర్ట్ ఉంది. దీంతో జనసేనకు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుంది.
వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకే దక్కే ఛాన్స్ ఉంది. అలాగే జనసేన సులువుగా గెలిచేస్తుంది. పొత్తు లేకపోయినా జనసేన కాస్త కష్టపడితే నరసాపురం అసెంబ్లీలో గెలిచే ఛాన్స్ ఉంది.