జేసి దివాకర్ రెడ్డికి షాక్ ఇచ్చిన తమ్ముడు…!

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అని ఆ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ నేతలపై చేస్తున్న దాడులు టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు అన్నీ కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా అయినా సరే టీడీపీ ని ఇబ్బంది పెట్టాలని అధికార పార్టీ భావించి పావులు కదుపుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అన్ని స్థానాలను ఏకగ్రీవం చెయ్యాలని ఆదేశించారు.

ఇక ఇది పక్కన పెడితే అనంతపురం లో రాజకీయాలు మరోసారి హీటేక్కాయి. జేసి దివాకర్ రెడ్డి ఫ్యామిలీ కేంద్రంగా ఈ రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వర్గం పోటీ చేయడం లేదని జేసి దివాకర్ రెడ్డి ప్రకటించారు. అయినా సరే ఆయన తమ్ముడు పోటీకి దిగడం గమనార్హం. తాను పనిచేసిన పదవి కంటే తక్కువ పోస్టుకు నామినేషన్ వేయడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.

తాడిపత్రి మున్సిపాలీటీ 30వ వార్డుకు కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తరపున ఆయన న్యాయవాదులు నామినేషన్ వేశారు. ఆయన ప్రత్యర్ధి ఎవరో కాదు. తాడిపత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్ధన్. దీనితో ఇప్పుడు అనంతపురం రాజకీయాలు సంచలనంగా మారాయి. జిల్లాలో తమ వర్గం ఎవరూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కూడా చేయరని జేసి దివాకర్ రెడ్డి చెప్పిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news