ఆంధ్రప్రదేశ్ లో ఫీజు రియంబర్సమేంట్ విషయంలో సర్కార్ తప్పు చేసిందా…? అమ్మ ఒడి తరహాలో ఇప్పుడు ఫీజుని తల్లి ఖాతాలోనే జమ చెయ్యాలి అని సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వృత్తి విద్యా కాలేజీలు ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. 2008 లో ఈ పథకాన్ని అప్పటి వైఎస్ సర్కార్ ప్రారంభించింది. ఆ తర్వాత వచ్చిన కిరణ్ సర్కార్, చంద్రబాబు, తెలంగాణా లో కేసీఆర్ కొనసాగించారు.
అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకం విషయంలో స్పష్టత రావడం లేదు. నవ రత్నాల సమయంలో కూడా దీనికి సంబంధించి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎంత అయితే అంత కాలేజి కి ఫీజు చెల్లిస్తామని చెప్పారు. ఇప్పుడు తల్లి ఖాతాలో జమ చేస్తామని చెప్తున్నారు. అదే జరిగితే… కాలేజీ ల నిర్వహణ అనేది చాలా భారంగా మారే అవకాశాలు ఉంటాయి అనే అభిప్రాయలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఫీజులను తల్లి ఖాతాలో వేస్తే చాలా మంది సొంత అవసరాలకు వాడుకునే అవకాశం ఉంటుంది.
కాలేజి కి చెల్లించే అవకాశం ఉండదు. 90 శాతం మంది పేదలకు ఆర్ధిక కష్టాలు ఉంటాయి కాబట్టి ఈ సొమ్ము వాళ్లకు ఉపయోగపడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. చదువుకి వాడే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి కాలేజీలకు నిర్వహణ… అంటే… జీతాలు, అద్దెలు, కరెంట్ బిల్లులు, వాహనాల పెట్రోల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇప్పుడు ఫీజులు కట్టకపోతే మాత్రం విద్యార్ధులను జాయిన్ చేసుకునే అవకాశం ఉండదు. ఫలితంగా ఆదాయం లేక మూత పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి అని సూచిస్తున్నారు.