బాబుపై జోకులు..వైసీపీ మిస్టేక్..!

-

రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం చేయడం నేతలకు పరిపాటి అయిపోయింది..రాజకీయంగా నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకోవడం ఎప్పుడో ముగిసింది..ఇప్పుడంతా పర్సనల్‌గా తిట్టుకోవడం, ఫ్యామిలీలని కూడా లాగి బూతులు తిట్టడం, ఎగతాళి చేయడం, గేలి చేయడం ఇదే నేటి రాజకీయాల్లో జరుగుతుంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత ఎక్కువగా ఇలాంటి రాజకీయం నడుస్తోంది. ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుని, పవన్, లోకేష్‌లని వైసీపీ నేతలు ఏ స్థాయిలో తిడతారో చెప్పాల్సిన పని లేదు.

ప్రతిపక్ష పార్టీలు ఏదైనా అంశం మీద ప్రశ్నించడమో..విమర్శలు చేయడం చేస్తే..వైసీపీ నేతలు కౌంటరుగా బూతులు తిడుతున్నారు..ఇటు టీడీపీ, జనసేన నేతలు కూడా తక్కువ కాదు..వారు కూడా అదే స్థాయిలో తిడుతున్నారు. ఇలా ఏపీలో బూతుల రాజకీయం నడుస్తోంది..అలాగే ప్రత్యర్ధులని ఎగతాళి చేసి మాట్లాడటం కూడా ఎక్కువైపోయింది. అన్నీ పార్టీలు అదే స్థాయిలో చేస్తున్నారు. కాకపోతే అధికారంలో ఉన్న వైసీపీ ఈ విషయంలో ముందుంది.

అసలు చంద్రబాబుని ఏ రేంజ్‌లో ఆడుకుంటారో చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసిన కామెంట్లని పట్టుకుని.. మామూలుగా ఎగతాళి చేయరు. తాజాగా బాబు కర్నూలు పర్యటనలో జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిందని, మళ్ళీ తానే గాడిలో పెట్టాలని, ప్రజలంతా అండగా ఉండాలని, ఈ సారి ఎన్నికల్లో గాని అండగా లేకపోతే…ఇవే తనకు చివరి ఎన్నికలు అని అన్నారు. అయితే బాబు అన్నదానిలో నిజమే ఉంది..ఆయనకు వయసు 73..ఎన్నికల నాటికి 75…అంటే అధికారం ఇస్తే ఐదేళ్ల పాటు పనిచేస్తారు..నెక్స్ట్ కూడా అధికారం ఇవ్వకపోతే 80 ఏళ్ల వరకు అంతే సంగతులు..అప్పుడు ఈ స్థాయిలో తిరిగి జనంలోకి వెళ్లలేరు. అందుకే ఇప్పుడే చివరి ఛాన్స్ అని అడుగుతున్నారు.

కానీ దీనిపై వైసీపీ మంత్రులు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబుకే కాదు..టీడీపీకి కూడా చివరి రోజులు అని, టీడీపీకి సమాధి కట్టేస్తున్నారని, నిజమే బాబుకు చివరి ఎన్నికలే అని, చివరి ఎన్నికలు అవ్వాలి తథాస్తు అంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు. బాబు రాజకీయ జీవితం ముగిసిందని కామెంట్లు చేస్తున్నారు. అయితే అసలు విషయం మాత్రం వదిలేస్తున్నారు…చివరి ఛాన్స్ అంటూ బాబు జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కర్నూలు పర్యటనలో బాబుకు వచ్చిన స్పందన చూస్తే..టీడీపీకి కొత్త ఊపు కనిపిస్తోంది. ఇక జనం కూడా పాపం ఇదే చివరి ఎన్నిక కాబట్టి బాబుకు ఛాన్స్ ఇద్దామని ఫిక్స్ అయే ఛాన్స్ ఉంది..అలా జరిగితే వైసీపీకి ఇబ్బంది. కాబట్టి ముందు వైసీపీ వాళ్ళు ఆ విషయంలో ఆలోచిస్తే బెటర్..ఇలా ఎగతాళి చేయడం వల్ల పావలా ఉపయోగం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news