నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీపై క్లారిటీ ఇదే.!

-

ఏపీలో తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పేరుతో పెద్ద ఎత్తున అలజడి చెలఎరేగుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పుడు..చంద్రబాబు పని అయిపోయింది..లోకేష్‌కు పార్టీని నడిపించే సత్తా లేదు..కాబట్టి జూనియర్ ఎన్టీఆర్‌కు టి‌డి‌పి పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది..అది కూడా వైసీపీ నేతల నుంచి వచ్చింది. అంటే టి‌డి‌పిని దెబ్బతీయడానికి ఇదొక రకమైన స్కెచ్ అని టి‌డి‌పి శ్రేణులు మండిపడ్డాయి. అలాగే చంద్రబాబు, లోకేష్ సభల్లో అప్పుడప్పుడు జై ఎన్టీఆర్ అంటూ కొందరు నినాదాలు చేయడం..అలాగే అక్కడకక్కడ సి‌ఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు వెలియడం చూశారు.

అయితే ఇవన్నీ చేసేది అసలైన ఎన్టీఆర్ అభిమానులు కాదని, వారి ముసుగులో వైసీపీ నేతలు చేస్తున్నారని తేలింది. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండపిలో లోకేష్ పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో  ‘కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే’ అని ఒంగోలులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీనిపై టి‌డి‌పి నేతలు..స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలను ఆరా తీయగా తమకెలాంటి సంబంధం లేదని చెప్పారట.

jr ntr

దీంతో ఇంకా టి‌డి‌పి లోతుగా ఆరా తీస్తే.. ఈ ఫ్లెక్సీల వెనుక ఒంగోలు 1వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు  ఉన్నారని తేలిందట. అంటే ఐప్యాక్ డైరక్షన్ లో వైసీపీ నేతలు..ఎన్టీఆర్ పేరుతో టి‌డి‌పిలో చిచ్చు పెట్టేలా ఫ్లెక్సీలు కడుతున్నారని తేలింది. అయితే అసలిన ఎన్టీఆర్ అభిమానులు ఇలాంటివి చేయరు అని కేవలం..ఎన్టీఆర్ అభిమానుల ముసుగులో ఉన్న వైసీపీ వారే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు.

అయితే తమ పార్టీ నేతలే ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఫ్లెక్సీలు వేశారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు వేస్తే అందులో హరికృష్ణ ఫోటో ఉండేదని,  కాబట్టి ఇదంతా చేసింది వైసీపీ నేతలే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news