వైసీపీకి కలిసిరాని ‘ఎన్టీఆర్’..!

ఎన్టీఆర్‌ని..టీడీపీని వేరు వేరుగా చూడని పరిస్తితి. టీడీపీ అంటే ఎన్టీఆర్ అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే టీడీపీ చంద్రబాబు చేతిలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఎన్టీఆర్‌ని టీడీపీకి దూరం చేయడానికి ప్రత్యర్ధులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడున్న టీడీపీ అసలు టీడీపీ కాదని విమర్శలు చేశారు. అయినా సరే ఎన్టీఆర్‌ని అభిమానించే వారు మెజారిటీగా టీడీపీ వైపే మొగ్గు చూపుతారు.

అయితే ఇప్పుడు వైసీపీ సైతం..ఎన్టీఆర్‌ని టీడీపీ నుంచి దూరం చేసి..ఎన్టీఆర్ అభిమానులని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. అలాగే కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు..చంద్రబాబుని ఎలా తిడతారో తెలిసిందే. ఎన్టీఆర్‌ చావుకు కారణం బాబు అనే విధంగా మాట్లాడతారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌ని మోసం చేశారని విమర్శలు చేస్తారు. ఇలా పదే పదే విమర్శలు చేసి..ఎన్టీఆర్ అభిమానులు..అదే సమయంలో కమ్మ వర్గాన్ని టీడీపీకి దూరం చేసే కార్యక్రమం చేస్తున్నారు.

ఇదే క్రమంలో ఎన్టీఆర్ పుట్టిన గడ్డ కృష్ణా జిల్లాలో టీడీపీకి ఆదరణ ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. అందుకే ఇక్కడ టీడీపీ బలం తగ్గించడానికి వైసీపీ గట్టిగానే కష్టపడుతుంది. అలాగే జిల్లా విభజన చేసి..విజయవాడ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు. దీని ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలనేది వైసీపీ కాన్సెప్ట్. గత ఎన్నికల్లో ఎలాగో వైసీపీ సత్తా చాటింది. ఈ సారి ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనేది వైసీపీ ప్లాన్.

అయితే ఎన్టీఆర్ పేరు పెట్టారు గాని..అటు ఎన్టీఆర్ జిల్లాలో గాని, ఇటు కృష్ణా జిల్లాలో గాని వైసీపీకి ఒరిగింది ఏమి లేదు. పైగా వైసీపీకి రివర్స్ అవుతూ వస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ బలం పెరుగుతుంది. జిల్లాలో ఏడు సీట్లు ఉంటే…విజయవాడ ఈస్ట్, సెంట్రల్, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ సీట్లలో టీడీపీ స్ట్రాంగ్ అయింది. ఒక్క తిరువూరులోనే వైసీపీ బలంగా కనిపిస్తోంది. ఇక టీడీపీ-జనసేన కలిస్తే విజయవాడ వెస్ట్‌లో వైసీపీకి ఇబ్బందే. మొత్తానికి ఎన్టీఆర్ పేరుతో చేసే రాజకీయం వైసీపీకి కలిసిరావడం లేదు.