కాశ్మీర్‌ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇదంతా మోడీ గ్రేట్‌నెస్‌-సీఎం యోగీ

-

.భారత్ వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్న యోగీ
.ప్రధాని మోడీ ఓ ట్రబుల్ షూటర్ అని ప్రసంశ
.భారత్ లో రామరాజ్య నిర్మాణం మొదలైందని వ్యాఖ్య

పీఓకేలో ఉన్న వ్యక్తులు భారత్‌లో భాగం కావాలని డిమాండ్ చేస్తున్నారు…ఎవరూ పాకిస్థాన్‌తో కలిసి ఉండాలని కోరుకోవడం లేదు…,ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఉద్దేశించి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్య. తొమ్మిదేళ్ల నరేంద్ర మోడీ పాలన గురించి మాట్లాడుతూ యోగి పైవిధంగా అన్నారు. ఇంతకుముందు లాగా ఇప్పుడు కాశ్మీర్ లో పరిస్థితులు లేవు. ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేత నిర్ణయాల వలన ఇప్పుడు కాశ్మీర్ లో శాంతిభద్రతలు పదిలంగా ఉన్నాయి. మోడీ ప్రధాని అయ్యాక కాశ్మీర్ ని పూర్తిగా కేంద్రం చేతిలోకి తీసుకున్నారు. ఉగ్రమూకల తోకలు కత్తిరించి మునుపెన్నడూ లేనంత ప్రశాంతంగా బ్రతికేలా అక్కడి ప్రజలకు భరోసా కల్పించారు.

Narendra Modi Yogi

పాక్ ఆధీనంలో ఉన్న పీఓకే ఇప్పటికే అనేక విధాలుగా ఇబ్బందులు పడుతోంది. అక్కడి ప్రజలు భారత్ లోకి రావాలని అనుకున్నా వారి చుట్టూ ఉన్న ఆంక్షలు వారిని కట్టి పడేస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన సంక్షోభంలో ఉండగా ఈ ప్రభావం పీఓకే మీద కూడా పడింది. అందుకే అక్కడి ప్రజలు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మోడీ అభయం కోసం వారు నిరీక్షిస్తున్నారు.

YOGI

ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పీఓకే అంశాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చారు.కశ్మీర్‌లో ఇప్పుడు ఎలాంటి హింసాకాండ జరగలేదని, అక్కడి వారు భారత్‌లో భాగం కావాలని చూస్తున్నట్లు వెల్లడించారు.అసలు పాకిస్తాన్‌లో ఉండాలని ఎవ్వరికీ లేదని పేర్కొన్నారు. భారతదేశం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించగా, పాకిస్తాన్ తన పాపాలకు శిక్ష అనుభవిస్తూ ఆకలితో ఉందన్నారు.ఆర్టికల్ 370ని రద్దు చేస్తారని తొమ్మిదేళ్ల క్రితం ఎవరైనా అనుకున్నారా అని ప్రశ్నించారు. దాని గురించి ఎవరూ ఆలోచన చేయలేదన్న యోగి 370ని చరిత్రలో చెత్తబుట్టలో పడేయడం మాత్రం అందరూ చూశారని అన్నారు.ఇది మోడీ గొప్పతనమన్నారు.భారతదేశ చట్టాల ప్రకారం కాశ్మీర్ పనిచేస్తోందని, అభివృద్ధి- శాంతి కలయికతో కొత్త ప్రవాహంలా ముందుకు సాగుతోందన్నారు.

సంక్షోభ సమయంలో ప్రపంచం ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోందని, ప్రధానమంత్రి ఇప్పుడు విశ్వవేదికపై ట్రబుల్షూటర్ గా పనిచేస్తున్నారని యోగి కొనియాడారు.భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి, అంతర్గత మరియు బాహ్య భద్రత, సంక్షేమ పథకాలను సామాన్య ప్రజలకు చేరవేసే పని ఏదైనా చాలా చిత్తశుద్ధితో చేశామని, అందుకే ప్రపంచ దృష్టికోణంలో మార్పు వచ్చిందని ఆయన అన్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో చొరబడాలని ఎవరైనా ధైర్యం చేస్తే వాళ్ళ స్థానంలోనే నిలబడి వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ చేసే ధైర్యం భారత్‌కు ఉందన్నారు.ఉగ్రవాదం, నక్సలిజం… నిర్ములించి రామరాజ్యానికి పునాది వేయబడిందని మోడీని ఆకాసానికెత్తేశారు. బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని, నేడు G20 సభ్యులకు కూడా నాయకత్వం వహిస్తోందని ఆదిత్యనాథ్ హైలైట్ చేశారు

Read more RELATED
Recommended to you

Latest news