కేసీఆర్‌కు సొంత జిల్లా నేతలే షాక్ ఇస్తున్నారా?

-

తెలంగాణలో ఎదురులేని నేత కేసిఆర్. ప్రతిపక్ష పార్టీలు పేరుకే తప్ప పోటీలో లేరని ధీమాతో ఉన్నారు కేసీఆర్. కానీ ఆయన అంచనాలను తలకిందులు చేస్తూ సొంత పార్టీ నేతలు షాక్ ఇస్తున్నారు.  రాబోయే ఎన్నికల కోసం ఏ పార్టీ చేయని విధంగా ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు కేసీఆర్.  ఆ జాబితా ప్రకటించిన నాటినుండి కేసీఆర్ కు సమస్యలు ఎక్కువయ్యాయి .

కే‌సి‌ఆర్ సొంత జిల్లా మెదక్ లోని మూడు నియోజకవర్గాల పరిస్థితి  ఆయన అంచనాకు అందటం లేదు. అధిష్టానం జాబితా విడుదల చేశాక అందరూ వారికే మద్దతుగా ఉంటూ విజయం కోసం కృషి చేయాలి, కానీ బి‌ఆర్‌ఎస్ లో ఎందుకు భిన్నంగా పార్టీ టికెట్ ఆశించిన అభ్యర్థులు నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. జాబితా ప్రకటించి రెండు వారాలు గడిచినా టికెట్ దక్కించుకున్న నేతలకు నమ్మకం కుదరటం లేదు.

brs party
brs party

మెదక్ నియోజకవర్గం పద్మ దేవేందర్ రెడ్డి కి ఇచ్చారు. ఈసారి కూడా విజయం సాధించి పద్మ హ్యాట్రిక్ కొడతారని కే‌సి‌ఆర్ భావించారు. కానీ పద్మాదేవేందర్ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేత మైనంపల్లి రోహిత్ ఉన్నారు. 10 సంవత్సరాలుగా నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని విపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. పద్మ భర్త దేవేందర్ రెడ్డి అవినీతి వలన సొంత పార్టీ నేతలే పద్మకు టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వబోమని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ గందరగోళంలో మెదక్ లో బి‌ఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడాల్సి ఉంది.

అటు పటాన్ చెరులో సిట్టింగ్ మహిపాల్ రెడ్డికి టికెట్ క్యాన్సిల్ చేయాలని,  బీసీ ముదిరాజులకు ఆ సీటు కేటాయించాలని, కేసీఆర్ మళ్ళీ  పునరాలోచించుకోవాలని బీసీ నేతలు నిరసన తెలుపుతున్నారు. కానీ రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ముదిరాజ్ ఓటర్లు ఉంటే కనీసం ఒక్క సీటు కూడా కేటాయించరా అంటూ ముదిరాజ్ నేతలు బహిరంగంగానే కే‌సి‌ఆర్ ను విమర్శిస్తున్నారు. బీసీ నేతలతో పాటు రెడ్డి సామాజిక వర్గం వారు కూడా బీసీ నేత నీలం మదుకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా నిలబెడతామని ప్రకటించడంతో మహీపాల్ రెడ్డికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

ఇటు జహీరాబాద్ లో మాణిక్యాలరావుకు టికెట్ క్యాన్సిల్ చేసి, ఢిల్లీ వసంత్ తనకే టికెట్ ఇవ్వాలని అందుకే పార్టీలో చేరానని అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నాడు. టికెట్ ఇవ్వకపోతే సొంతంగా నైనా బరిలో దిగాలని వసంత్ వర్గం సూచిస్తుండటంతో అధిష్టానం అయోమయంలో పడిపోయింది.

మొత్తానికి మూడోసారి విజయవంతంగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి హ్యాట్రిక్ సాధించాలని ఆశపడుతున్న కేసిఆర్ కు సొంత జిల్లా నేతలే చుక్కలు చూపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news