అనుభవానికి కెసిఆర్ ఇచ్చిన విలువ ఇది…!

-

కే కేశవరావు… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బహుశా ఈ పేరు తెలియని వారు ఉండరు. కాంగ్రెస్ హయాంలో హుందా గల మంత్రిగా, సీనియర్ నేతగా, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నా మరెవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఆయన కీలక పాత్ర పోషించారు. రాజకీయాల్లో కేకే ఎన్నో పదవులు చూసారు. మంత్రి పదవులు అనుభవించారు. తెలంగాణా మీద అభిమానంతో ఆయన కెసిఆర్ సమక్షంలో 2014 ఎన్నికలకు ముందు తెరాస లో జాయిన్ అయ్యారు.

తెరాస లో ఉన్నా సరే కేకే కి కెసిఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీలో కీలక పదవి ఇచ్చారు ఆయనకు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కేకే. పార్లమెంటరి పక్ష నేతగా ఆయన్ను ఎంపిక చేసారు కెసిఆర్. ఇక ఇప్పుడు మళ్ళీ ఆయన్ను రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. 80 ఏళ్లు దాటినప్పటికీ చలాకీగా ఉంటూ కేకే వ్యూహాలు సిద్దం చేస్తూ… పార్టీ విజయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

నేడు కేకే తెరాస లో అగ్ర నేత… జాతీయ నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. జాతీయస్థాయిలో భవిష్యత్తు రాజకీయ అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఆయనకు పదవి మరోసారి రెన్యువల్ చేసారని తెరాస నేతలు అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఏపీ కోటాలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా రిటైర్‌ కావాలి. అయినా సరే ఆయన అవసరమని భావించి కెసిఆర్ రాజ్యసభకు పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news