జై తెలంగాణ పోయే..జై భారత్ వచ్చే..కేసీఆర్ మార్క్!

-

ఎలాంటి రాజకీయ పరిస్తితులైన తనకు అనుకూలంగా మార్చుకోవడం కేసీఆర్ ధిట్ట అని చెప్పాలి. తనకు తగినట్లుగా రాజకీయాన్ని మార్చుకోగలరు. అందుకే రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావడమే కాదు..కేంద్రంలో కూడా పాగా వేయాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. అయితే రెండు సార్లు తెలంగాణ సెంటిమెంట్ తోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే సెంటిమెంట్ తో ప్రత్యర్ధి పార్టీని దెబ్బతీశారు.

ఇక తమకు తిరుగులేదనే స్థితిలోకి వచ్చిన కేసీఆర్…ఇప్పుడు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణని పక్కన పెట్టి భారత్ అంటూ కొత్తగా రాజకీయం మొదలుపెట్టారు. ఇది కూడా కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ అని చెప్పాలి. తనకు తగిన విధంగా దేశ రాజకీయాల్లోకి రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తాజాగా ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సభకు ఢిల్లీ, కేరళ, పాంజబ్ సీఎంలతో పాటు సి‌పి‌ఐ, సి‌పి‌ఎం కీలక నేతలు వచ్చారు.

KCR speaking in the meeting

అయితే సభ మొత్తం అందరూ నాయకులు బీజేపీని టార్గెట్ చేయడం, మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే వచ్చారు. కేసీఆర్ సైతం అదే తరహాలో మోదీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. వ్యవసాయం, ఆర్ధిక రంగాలు, ప్రయివేటీకరణ అంశాలపై మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. 2024లో మోదీని గద్దె దించి విపక్షాల ప్రభుత్వం వస్తుందని అన్నారు. చెప్పాలంటే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కాస్త బీజేపీని విమర్శించే సభగా మారింది.

ఇక చివరిలో కేసీఆర్ ఎప్పుడు జై తెలంగాణ అంటారు..కానీ దానికి భిన్నంగా ఇప్పుడు జై భారత్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. దీంతో కేసీఆర్ తెలంగాణ నినాదం వదిలేసి భారత్ నినాదంతో రాజకీయం మొదలుపెట్టారని అర్ధమవుతుంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news