కేసీఆర్ కొత్త ఆట: తెరాస కౌగిలిలో కాంగ్రెస్!

-

తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేవలం హుజూరాబాద్ కేంద్రంగానే ప్రస్తూతం కేసీఆర్ అడుగులు అని అనిపిస్తున్నా.. జమిలీ – ముందస్తు ఆలోచనగా కూడా కేసీఆర్ అడుగులు పడుతున్నాయి. ఈ విషయంలో సెంట్రల్ పాయింట్ గా నిలుస్తుంది.. “దళిత బంధు” పథకం!

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

అవును… కేసీఆర్ మానసపుత్రికగా చెప్పుకుంటున్న దళితబంధు పథకంపై రివ్యూ మీటింగ్ జరగనుంది. అలా అని ప్రగతిభవన్ లో కేసీఆర్ & కో మాత్రమే ఈ పథకంపై రివ్యూ చేస్తారని అనుకుంటే పొరపాటే! కేసీఆర్ ఈ రివ్యూ మీటింగ్ కి అన్ని పక్షాలనూ ఆహ్వానించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ హాజరుకానుండటం కీలకంగా మారింది.

కేసీఆర్ పెట్టబోయే ఈ రివ్యూ మీటింగ్ కి కాంగ్రెస్ పార్టీ తరుపున భట్టి విక్రమార్క వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో… భట్టి విక్రమార్క, కేసీఆర్ తో ఈ పథకంపై ఏస్థాయిలో సంభాషిస్తారనే అంశంపై కాంగ్రెస్ క్రెడిట్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే… ప్రెస్ మీట్ లో కేసీఆర్ పై చేసే విమర్శలు వేరు.. రివ్యూ మీటింగ్ లో నేరుగా అభిప్రాయాలు చెప్పడం వేరు!

ఈక్రమంలో… కేసీఅర్ ఆహ్వానం మేరకు భట్టి హాజరయ్యి… దళితబంధు ఒక్క హుజూరాబాద్ లోనే కాదు రాష్ట్రం మొత్తం అమలుచేయాలని డిమాండ్ చేస్తారు.. బీసీ బంధు కూడా పెట్టాలని కోరతారు.. కేసీఆర్ “సరే” అంటారు! ఫలితంగా… ప్రతిపక్షాలను సైతం ఒప్పించగలిగారు – కేసీఆర్ రాజకీయ చాణక్యుడు అనే పేరు సంపాదించుకుంటారు!

అలా కాకుండా.. దళితబంధు కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడితే… కేసీఆర్ కు మరో అస్త్రం దొరుకుతుంది! “ఎవరు అడ్డొచ్చినా, మరెవరు తోక అడ్డుపెట్టినా… దళితబంధు ఆగదు.. ఆపను..” అంటూ కేసీఆర్ ప్రసంగాలు మొదలవుతాయి. ఫలితంగా కేసీఆర్ కే క్రెడిట్!

సో… కేసీఆర్ పెడుతున్న రివ్యూ మీటింగ్ కి కాంగ్రెస్ పార్టీ హాజరైనా – గైర్హాజరైనా… దళితబంధుకు సరే నన్నా, సరే కాదన్నా… కేసీఆర్ కే ప్లస్ అవుతుంది. ఫలితంగా కేసీఆర్ కే మొత్తం క్రెడిట్ దక్కుతుంది.. ప్రతిపక్షాల పాత్ర ప్రేక్షకపాత్ర గా మిగిలిపోతుంది! కేసీఆర్ వ్యూహమా.. మజాకా?

అలా కాకుండా… దళితబంధుకు సరేనన్న కాంగ్రెస్, ఆ పథకం అమలుపై నిత్యం మానిటర్ చేస్తూ, ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాగలిగితే.. ఆర్థిక ఇబ్బందులవల్ల కేసీఆర్ ఇరకాటంలో పడేఛాన్స్ ఉంది. సో… దళితబంధు కేసీఆర్ కు ఇనిస్టెంట్ ఎనర్జీ కాగా, కాంగ్రెస్ కు కాస్త ఆలస్యంగా వచ్చే ఎనర్జీ అన్నమాట. అది కూడా.. కాంగ్రెస్ మానిటరింగ్ పై ఆధారపడి ఉంటుంది!b

Read more RELATED
Recommended to you

Latest news