కామారెడ్డిలో కేసీఆర్ ప్రత్యర్ధులు వీరే?

-

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గం..మొన్నటివరకు ఈ స్థానం రాజకీయంగా పెద్దగా హైలైట్ కాలేదు. కానీ ఎప్పుడైతే సి‌ఎం కే‌సి‌ఆర్..ఇక్కడ నేరుగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారో అప్పటినుంచి ఈ స్థానం గురించి చర్చ నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో కే‌సి‌ఆర్..గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఒకచోట పోటీ చేస్తే ఓడిపోతారని, రెండు చోట్ల పోటీ చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి.

అటు గజ్వేల్ ఉన్న మెదక్ జిల్లాతో పాటు, కామారెడ్డి ఉన్న నిజామాబాద్ లో కే‌సి‌ఆర్ పోటీ చేయడం వల్ల..ఆయా జిల్లాలో బి‌ఆర్‌ఎస్‌కు అడ్వాంటేజ్ అవుతుందని కే‌సి‌ఆర్ పోటీ చేస్తున్నారని బి‌ఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. ఇలా ఎవరి వర్షన్ వారికి ఉంది. కానీ కే‌సి‌ఆర్ రెండు చోట్ల పోటీ చేయడం చర్చనీయాంశమైంది. ఇక గజ్వేల్ లో కే‌సి‌ఆర్ పై ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. కాంగ్రెస్, బి‌జే‌పి అభ్యర్ధులు తేలలేదు. కానీ కామారెడ్డిలో దాదాపు కే‌సి‌ఆర్ పై పోటీ చేసే అభ్యర్ధులు ఫిక్స్. మొదట నుంచి కామారెడ్డిలోనే ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ పోటీకి దిగడం ఖాయమే.

గత మూడు ఎన్నికల నుంచి ఆయన గెలుపుకు దూరమయ్యారు. దీంతో ఆయనపై సానుభూతి ఉంది. కానీ ఇప్పుడు కే‌సి‌ఆర్ ప్రత్యర్ధి అవ్వడం వల్ల పోటీ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నుంచి ఒక కార్యకర్త సైతం సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారట. కానీ సీటు షబ్బీర్‌కే ఫిక్స్. అటు బి‌జే‌పి నుంచి కాటిపల్లి వెంకట రమణారెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది.

గత ఎన్నికల్లో బి‌జే‌పికి 15 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. కాబట్టి ఇక్కడ బి‌జే‌పి ప్రభావం తక్కువే. కాకపోతే ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ప్రధాన పోరు కే‌సి‌ఆర్, షబ్బీర్ అలీ మధ్యే..అయితే కే‌సి‌ఆర్‌ని ఓడించడం అనేది కాస్త అసాధ్యమైన పనే.

Read more RELATED
Recommended to you

Exit mobile version