కిషన్-సంజయ్-బాపూరావులు రూట్ మళ్ళీ మారుస్తారా?

-

రాజకీయాల్లో నేతలకు కష్టంతో పాటు కాస్త అదృష్టం కూడా తోడైతేనే..మంచి విజయాలు సాధించగలుగుతారు. అదృష్టం లేకుండా ఒకోసారి ఎంత కష్టపడిన ఫలితం దక్కదనే చెప్పాలి. కానీ ఫలితం కోసం కష్టపడుతూ ముందుకెళితే… ప్రయోజనం ఉంటుందనే చెప్పాలి. ఏదో ఒకసారి అదృష్టం కలిసిరాలేదని మరొకసారి కలిసిరాకుండా ఉండదు. కాబట్టి రాజకీయాల్లో కష్టం ఎప్పుడు ముఖ్యమే.. అయితే అలా కష్టపడే తెలంగాణలో ముగ్గురు బీజేపీ నాయకులు సక్సెస్ అయ్యారు.

ఒకసారి ఓటమి వచ్చిందని వెంటాన్ర్ క్రుంగిపోకుండా మరొకసారి ప్రయత్నిచి సక్సెస్ అయ్యారు…అలా సక్సెస్ అయిన నేతలు ఎవరో కాదు…ఒకరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరొకరు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అలాగే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావులు. ఈ ముగ్గురు నేతలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతుల్లో ఓడిపోయారు. కిషన్ రెడ్డి…అంబర్‌పేట స్థానంలో, బండి సంజయ్…కరీంనగర్ స్థానంలో…బాపూరావు…బోథ్ స్థానంలో ఓడిపోయారు.

అయితే అంబర్‌పేటలో కిషన్ రెడ్డి ఓటమిని ఎవరూ ఊహించలేదు. కానీ స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. కానీ వెంటనే పార్లమెంట్ ఎన్నికల రూపంలో కిషన్ రెడ్డికి కలిసొచ్చింది…సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచి…ఇప్పుడు కేంద్ర మంత్రి స్థాయికి వెళ్లారు. అటు బండి…కరీంనగర్ అసెంబ్లీలో ఓడిపోయి..ఆ వెంటనే కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిచి…బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వరకు ఎదిగారు.

ఇక 2018లో బాపూరావు కాంగ్రెస్ తరుపున పోటీ చేసి బోథ్‌లో ఓడిపోయారు. ఆ వెంటనే బీజేపీలో చేరి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. అటు నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలిచిన విషయం తెలిసిందే. ఆయన డైరక్ట్‌గా పార్లమెంట్ ఎన్నికల బరిలోనే దిగారు. కానీ ఆ ముగ్గురు నేతలు మాత్రం అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయి, పార్లమెంట్ స్థానాల్లో సక్సెస్ అయ్యారు. ఇలా ఇప్పుడు ఎంపీలుగా ఉన్న ఆ ముగ్గురు…మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో వారి వారి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. వారు అసెంబ్లీ స్థానాలకు రిటర్న్ వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news