టూరిజం రంగంలో మన దేశం చాలా అభివృద్ధి చెందిందని, నరేంద్రమోదీ నేతృత్వంలో ని కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ,ప్రజా రవాణాను అభివృద్ధి కి అహర్నిశలు కృషి చేస్తుందని కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే నాలుగు ఏళ్లలో మరో 100 ఎయిర్ పోర్టులు నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు కిషన్ రెడ్డి.
భారతదేశపు అతిపెద్ద ప్రజా రవాణా సంబంధించిన సమావేశం (ప్రవాస్ 3.0) పేరిట హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన సమావేశాన్నీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంబించారు . బస్సులు మరియు కార్ ఆపరేటర్స్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా (BOCI) నిర్వహించిన ఈ ఫ్లాగ్ షిప్ (ప్రవాస్ 3.0) సమావేశంలో ప్రయాణికులకు స్థిరమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రోత్సహించడమే లక్ష్యమని ఆయన అన్నారు.పర్యటన ఆపరేటర్లు,పర్యాటక క్యాబ్స్, తదితర రవాణా వ్యవస్థ ఒకే వేదికపైకి తీసుకురావడం వల్ల ప్రజా రవాణా అభివృద్ధి కి ,కొత్త ఆశయాల రూపకల్పన కొరకు సహాయపడే ఒక గొప్ప వేదిక అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ సమాఖ్య సమేవేశంలో ఫ్లీట్ యజమానులు మరియు ఆపరేటర్ల తో పాటు 28 రాష్ట్రాలు ,8 కేంద్ర పాలిత ప్రాంతాలు,ఓ ఈ ఎమ్ లు ,తదితర ప్రజా రవాణా మరియు పర్యావరణ వ్యవస్థను ఒక్క చోటికి తీసుకురావాడంతో పాటు ఇంటర్ సిటీ ఇంట్రాసిటీ,స్కూల్ బస్సులు,ఉద్యోగుల రవాణా,తదితర రవాణా అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.