ఆయన ఈనెల 28న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీలో చేరేందుకే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని.. ఆరోజే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి.
నేను గనుక బీజేపీలో చేరితే 2023లో నేనే సీఎం. భవిష్యత్తులో ముఖ్యమంత్రిని నేను అవుతా.. అంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో బయటికి వచ్చిన ఈ ఆడియో క్లిప్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ కు చెందిన ఓ కార్యకర్తతో ఫోన్ లో మాట్లాడుతూ… నేను గనుక బీజేపీలో చేరితే.. భవిష్యత్తులో నేనే సీఎం. వచ్చే ఎన్నికల్లో నేనే సీఎంను.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని రాహుల్ గాంధీకి కూడా తెలుసు.. అంటూ ఆ కార్యకర్తతో కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం.. ఆ ఆడియో టేప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది. దీంతో వామ్మో.. కోమటిరెడ్డికి భలే ఆశ ఉందే. బీజేపీలో చేరి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయిపోతావా? అంటూ రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.
అయితే.. ఆయన ఈనెల 28న ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీలో చేరేందుకే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని.. ఆరోజే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి.