నా తమ్ముడు అనిల్‌ కుమార్‌ వ్యాఖ్యలు బాధించాయి : కోటంరెడ్డి

-

తన ఫోన్‌ ట్యాపింగ్‌.. అధికారుల పని కాదు.. ప్రభుత్వ పెద్దల పనని వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. మానసిక క్షోభకు గురై వైసీపీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. బయటకు వచ్చాక తన ఇష్టం వచ్చిన వ్యక్తులను కలవవచ్చని చెప్పారు. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ వేడుకలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని.. డిసెంబర్‌ 25న నేను చంద్రబాబును ఎలా కలుస్తానని ప్రశ్నించారు. తర్వాత రోజే పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. తప్పుడు ఆరోపణలతో సజ్జల ఆడియోలు వదులుతున్నారని ఆరోపించారు.

‘‘మంత్రులు, సలహాదారులు ఒక్కడిని చేసి మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలుగా విషప్రచారం చేస్తున్నారు. నేరాలు చేసిన వ్యక్తులే తాము నిరూపిస్తామని చెబుతున్నారు. నేను చివరి వరకు పార్టీలో ఉండి మోసం చేయలేదు. నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పు. నా తమ్ముడు అనిల్‌ కుమార్‌ వ్యాఖ్యలు బాధించాయి. గతంలో అనిల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే నా కుటుంబం అల్లాడింది. నా కుటుంబం.. మీ కుటుంబం వేరు అని ఎప్పుడూ అనుకోలేదు. నీపై ఎప్పుడూ నేను ఎత్తులు.. పైఎత్తులు వేయలేదు. మా మధ్య రాజకీయ బంధాలు లేకపోవచ్చు.. అనుబంధాలు ఉంటాయి. నేను తప్పు చేస్తే సర్వనాశనం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. రుద్రాక్ష చేతబూని అబద్ధాలు చెబితే నన్ను శిక్షించాలని ప్రార్థిస్తున్నా. తప్పు చేయకుండా ఉంటే దేవుడు నాకు అండగా ఉంటాడు’’ అని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version