బీజేపీకి అవకాశం ఇస్తే తెలంగాణను ఏపీలో కలుపుతాడు… కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

బీజేపీ, నరేంద్ర మోదీకి అవకాశం ఇస్తే తెలంగాణను ఏపీలో కలుపుతారని.. మనల్ని కూడా అమ్మేస్తారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాటున ఎవరైనా పిలగాళ్లు ఆగం అయితే.. మళ్లీ తెలంగాణను, ఆంధ్రను కలిపినా..కలుపుతారు ఈ పుణ్యత్ములు అని విమర్శించారు. బీజేపీ కుల, మతాల మధ్య విద్వేశాలు పెంచుతున్నారని విమర్శించారు. తెలంగాణకు ఏం చేశారని బీజేపీ ప్రశ్నించారు. నరేంద్రమోదీ అధికారం చేపట్టి ఏడున్నరేళ్లు అయిందని.. అయినా తెలంగాణలకు ఎలాంటి ప్రాజెక్ట్ లు ఇవ్వలేదనన్నారు. నవోదయ పాఠశాలలు, వైద్య కళాశాలలు, ఐఏఎంలు తెలంగాణకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ప్రధాని కేవలం ఉత్తర్ భారత దేశానికి, ఉత్తర్ ప్రదేశ్ కు మాత్రమే ప్రధాన మంత్రా..? అని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలంటే.. వాట్సాప్ యూనివర్సిటీలో గబ్బు లేపుతున్నారని బీజేపీని విమర్శించారు. తెలంగాణ పుట్టుకనే ప్రధాని మోదీ ప్రశ్నిస్తున్నారని.. తెలంగాణ బీజేపీ నాయకులకు ఏం రోగం వచ్చిందని.. ఎంత సేపు మోదీ భజనేనా.. రేషం, తెలంగాణ రక్తం లేదా.. అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. గిరిజన రిజర్వేషన్లను పెంచాలని.. తీర్మాణం చేసి పంపిస్తే.. ఇప్పటికీ అతిగతి లేదని అన్నారు. గిరిజన బిడ్డలకు న్యాయం చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. బీజేపీ దేశం కోసం, ధర్మం కోసమని డైలాగులు తప్పితే.. చెసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. బయ్యారం ఉక్క కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పెట్టడం లేదని.. మోదీకి తెలంగాణ అంటే వివక్ష అని దుయ్యబట్టారు. స్వతంత్ర చరిత్రలో ఇంతకన్నా చెత్త ప్రభుత్వం లేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news