అభాసుపాలవుతున్న లోకేశ్.. అత్యుత్సాహంతో మొదటికే మోసం..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ భావి నేత నారా లోకేశ్ గతంతో పోల్చితే ఇటీవల కాలంలో జనంలో బాగా తిరుగుతున్నారని, ప్రజా సమస్యలపై తన గళం వినిపిస్తున్నారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఉత్సాహంగా పనిచేయడం వరకు ఓకే. కానీ, లోకేశ్ అత్యుత్సాహానికి పోయి అభాసు‌పాలవుతున్నడనే మాటలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఏపీలో ఏది జరిగానే అది వైసీపీ ప్రభుత్వ వైఫల్యం అని పేర్కొనేందుకు ముందుకు రాకుండా నిజా నిజాలు నిర్ధారించుకుని ముందుకొస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా లోకేశ్ చేసిన ఓ తొందరపాటు పనికిగాను అతడిని ట్రోల్ చేస్తున్నారు.

 

అసలేం జరిగిందంటే.. ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి విష్ణు అనే బాలుడు చనిపోయాడు. ఈ ఘటన గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయకుండానే లోకేశ్ సోషల్ మీడియా టైం ఏపీ సర్కారున విమర్శించడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఏపీ సర్కారు చేపట్టిన ‘నాడు-నేడు’ కార్యక్రమం అంతా ఉట్టిదేనని ఆరోపణలు చేసే ప్రయత్నం చేసింది. అయితే, మరో వైపు నుంచి చిన్నారి మరణాన్ని టీడీపీ నేత లోకేశ్, అతడి టీం రాజకీయం చేస్తున్నదనే వాదన వినబడుతోంది. అయితే, నిజానికి బాలుడు శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్ వద్దకు వెళ్లి ఆడుతున్న క్రమంలో అది కూలి చనిపోయాడు. కానీ, సదరు బాలుడు చదువుతున్న పాఠశాల ప్రభుత్వ పాఠశాల కాదనీ, ప్రైవేటు పాఠశాల అని తాజాగా తెలిసింది. దీంతో లోకేశ్ తీరును తప్పుబడుతూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ప్రతీ దానికి లోకేశ్ వైసీపీ ప్రభుత్వం వల్లే అనడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఏపీలో ఏ తప్పు జరగినా దానికి వైసీపీ అధినేత జగన్ బాధ్యత వహించాలనేలా లోకేశ్ వ్యవహరించడం సరికాదనే వాదనాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనయుడిగా ఉన్న లోకేశ్ పలు విషయాలను అర్థం చేసుకుని ముందుకు సాగాలని పలువురు సూచిస్తున్నారు.