అమరావతి : ‘నేను ముఖ్యమంత్రినో, లేక మంత్రినో తెలియకుండానే పవన్ కళ్యాణ్ నన్ను ముఖ్యమంత్రిగా సంబోధించి మాట్లాడు తున్నారు.. అవగాహన లోపమా, లేక ఎద్దేవా చేయడానికా?..అంటూ ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ సూటిగా ప్రశ్నించారు. కొవ్వూరు బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జవహర్‌పై చేసిన విమర్శలు, ఆరోపణలపై మంత్రి జవహర్ స్పందించారు. కొవ్వూరులో డిగ్రీ కాలేజీ లేదంటూ పవన్ మాట్లాడటం అవగాహన రాహిత్యమన్నారు.
ఇరవై సంవత్సరాల క్రితమే ఏబీఎన్ డిగ్రీ కాలేజీ ఉండగా, కొవ్వూరుకు అతి సమీపాన ఉన్న రాజ మహేంద్రవరం లోను డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, త్వరలోనే మరో డిగ్రీ కాలేజీ అదనంగా కొవ్వూరుకు వస్తుందని మంత్రి జవహర్ చెప్పారు.
నన్ను సీఎం అంటున్న పవన్ను ఏమనాలి ? మంత్రి జవహర్
-