హైదరాబాద్ వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీనితో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తుంది. మంత్రి కేటిఅర్ స్వయంగా యుద్ద క్షేత్రంలో దిగారు. నగరంలో కురిసిన భారీ వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు కాలనీల్లో ఆయన స్వయంగా రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ రోజు ముషీరాబాద్ నియోజకవర్గంలోని నల్లకుంట లోని శ్రీరామ్ నగర్ బస్తీలో నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు.
స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ సహా ఇతర జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో కలిసి ఆయన పర్యటించారు. అంబర్పేట్ లోని ప్రేమ్ నగర్ పటేల్ నగర్ కాలనీలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా కాలనీల్లో వరద నివారణ కోసం శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన పనులకు సంబంధించి ఆయన వెంటనే అనుమతులు ఇచ్చేసారు. కాలనీలో వరద రాకుండా చేపట్టాల్సిన పైప్లైన్లు డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని జోనల్ కమిషనర్ ని ఆదేశించారు.