రోజాకు ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ చేశారట. వెంటనే అమరావతికి రావాలంటూ చెప్పారట. దీంతో ఆమె వెంటనే హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం ఏపీ సీఎం జగన్ తో రోజా భేటీ ఉంటుందని తెలుస్తోంది.
నాకు మంత్రి పదవి రాలేదని నేను ఏమాత్రం బాధపడటం లేదు. నాకు అస్సలు బాధ లేదు. నా ఏ పదవి ఇవ్వకున్నా నేను బాధపడను.. అంటూనే ఎమ్మెల్యే రోజా లోలోపల బాధపడుతోందని తెలుస్తూనే ఉంది. నాకు నామినేటెడ్ పదవి ఏదీ దక్కడం లేదు. నేను అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికే విజయవాడకు వచ్చాను అని రోజా చెబుతున్నా… ఆమె ఏపీ సీఎం జగన్ ఆహ్వానం మేరకే విజయవాడ వచ్చినట్లుగా తెలుస్తోంది.
విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు… రోజాకు ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ చేశారట. వెంటనే అమరావతికి రావాలంటూ చెప్పారట. దీంతో ఆమె వెంటనే హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం ఏపీ సీఎం జగన్ తో రోజా భేటీ ఉంటుందని తెలుస్తోంది. ఈ భేటీలో రోజాతో జగన్ పలు కీలక విషయాలపై చర్చించనున్నారట. అంతే కాదు.. మంత్రి పదవి ఇవ్వనందున ఆమె అలిగిందని.. అందుకే నామినేటెడ్ పదవిని రోజాకు ఇవ్వడానికి జగన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఆమెకు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. చూద్దాం.. మరి ఆమెకు జగన్ ఏదైనా పదవి కట్టబెడతారా? లేక.. ఆమెను బుజ్జగించి పంపిస్తారా? అంటే కాసేపు వేచి చూడాల్సిందే.