ముంబై జారిపోయింది… హైదరాబాద్ ని మోడీషా టార్గెట్ చేస్తారా…?

-

దేశ ఆర్ధిక రాజధాని ముంబై… దేశ ఆర్ధిక వ్యవస్థకు ముంబై చాలా కీలకం… మహారాష్ట్ర నుంచి కేంద్రానికి భారీగా ఆదాయం వెళ్తుంది. కేంద్రంలో పాలించే పార్టీ మహారాష్ట్రలో కూడా పాలిస్తేనే కేంద్రానికి ఏ ఇబ్బందులు ఉండవని ఆర్ధిక నిపుణులు కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు కేంద్రం ఆర్ధిక కష్టాల్లో ఉంది… ఆదాయ వనరులు కేంద్రానికి తగ్గిపోయాయి అనేది వాస్తవం. వృద్ది రేటు క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర కేంద్రం చేతి నుంచి జారిపోయింది… కల్పతరువుగా ఉండే రాష్ట్రం కమలానికి దూరమైంది…

మరి ఇప్పుడు బిజెపి ఏం చేస్తుంది…? ఆదాయం కోసం ఏ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తుంది. కర్ణాటక లో అధికారంలో ఉంది కాబట్టి బెంగుళూరు బిజెపి చేతిలో ఉంది… మరి ముంబైలోటు ని పూర్తి చేసే నగరం…? ఈ నేపధ్యంలో కేంద్రం హైదరాబాద్ మీద కన్నేస్తుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక కంపెనీలు ఉన్నాయి, పారిశ్రామికంగా, ఐటి పరంగా హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో హైదరాబాద్ కి భారీగా ఆదాయం వస్తుంది… హైదరాబాద్ నుంచి తెలంగాణకు,

ఏడాదికి లక్ష కోట్ల ఆదాయం వెళ్తుంది… దీనితో హైదరాబాద్ మీద కేంద్రం కన్నేసి కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇది రాజకీయంగా కూడా కెసిఆర్ ని దెబ్బ కొట్టడానికి అవకాశం దొరుకుతుందని, హైదరాబాద్ లేకపోతే తెలంగాణా ఆదాయం తగ్గుతుందని తద్వారా కెసిఆర్ ని ఇబ్బంది పెట్టవచ్చు అనే భావనలో కేంద్రం ఉందని అంటున్నారు. ప్రతిష్టాత్మక కంపెనీలు ఉండటంతో భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది… దీని కోసం ఇప్పటి నుంచే మోడీషా వ్యూహం అమలు చేయడం మొదలుపెట్టారని, తెలంగాణా గవర్నర్ ద్వారా పలు నివేదికలు కూడా హైదరాబాద్ గురించి తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలుపెడుతుందని వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news