నరసాపురం నుంచే రఘురామ..వైసీపీ నుంచి ఎవరంటే?

సీఎం జగన్ పర్యటనతో మరోసారి నరసాపురం పార్లమెంట్ వార్తల్లోకి ఎక్కింది. తాజాగా జగన్..నరసాపురంలో పర్యటించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించారు. అలాగే రాజకీయంగా టీడీపీ-జనసేనలపై విమర్శలు చేశారు. అయితే జగన్ పర్యటన సందర్భంగా నరసాపురం పార్లమెంట్ విషయం హైలైట్ అయింది..ఇక్కడ జగన్ ప్రభుత్వానికి కంట్లో నలక మాదిరిగా ఉన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉన్నారు.

గత ఎన్నికల్లో ఈయన వైసీపీ నుంచి గెలిచి..ఆ తర్వాత వైసీపీపైనే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి వైసీపీ వర్సెస్ రఘురామ అన్నట్లు వార్ నడుస్తోంది. ఢిల్లీలో ఉంటూ ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈయనకు చెక్ పెట్టాలని వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది..ఆయనపై వేటు వేయించాలని చూశారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు.

దీంతో వచ్చే ఎన్నికల్లో ఈయనకు ఖచ్చితంగా చెక్ పెట్టాలని జగన్ చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్‌లో వైసీపీ తరుపున బలమైన అభ్యర్ధిని నిలబెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజుని నరసాపురం పార్లమెంట్ బరిలో పెట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దాదాపు ఈయనే అభ్యర్ధిగా ఉంటారని ప్రచారం ఉంది. మరి చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు లేకపోతే..ఈయన నరసాపురం వైసీపీ పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తారు.

ఇక వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్న రఘురామకృష్ణంరాజు సైతం..నెక్స్ట్ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని, ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో దిగి వైసీపీకి చెక్ పెడతానని తాజాగా చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ కూడా కలిసే అవకడం ఉందని అన్నారు. కానీ టీడీపీ-జనసేన పొత్తు తప్పనిసరిగా ఉంటుందని అంటున్నారు. ఆ రెండు పార్టీలు కలిస్తే నరసాపురంలో వైసీపీని ఈజీగా ఓడించవచ్చు అనేది రఘురామ ప్లాన్.