మునుగోడు 8వ రౌండ్: లీడ్‌లో కారు..పోరాడుతున్న కమలం..!

-

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది…అంతా అనుకున్నట్లు ఫలితం వన్ సైడ్ గా రావట్లేదు. టీఆర్ఎస్-బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఒక రౌండ్‌లో కారు లీడ్‌లోకి వస్తే..మరొక రౌండ్‌లో కమలం లీడ్‌లోకి వస్తుంది. ఎవరు లీడ్‌లోకి వచ్చినా సరే స్వల్ప ఆధిక్యం మాత్రం ఉంటుంది. అయితే ఎక్కువ రౌండ్లలో టీఆర్ఎస్‌ లీడ్ సాధించింది. ఏడో రౌండ్లో మునుగోడు మంటల ఓట్లను లెక్కించారు. ఏడో రౌండ్ ముగిసే సమయానికి 2,572 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్కు 45,723 ఓట్లు రాగా.. బీజేపీకి 43,151 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్కు 12,025 ఓట్లు వచ్చాయి.

తాజా 8వ రౌండ్‌లో టీఆర్ఎస్- 6624, బీజేపీ -6088 ఓట్లు వచ్చాయి. టి‌ఆర్‌ఎస్ లీడ్ 536 వచ్చింది. ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి టి‌ఆర్‌ఎస్లీడ్ 3091 ఓట్ల లీడ్‌లో కొనసాగుతోంది.

అయితే 1 గంటకే తుది ఫలితం వస్తుందని అంతా ఆశించారు. కానీ 1 గంట దాటిన సరే సగం రౌండ్లు కూడా పూర్తి కాలేదు. 15 రౌండ్లలో ఫలితం వెలువడనుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఉంది స్వల్ప మెజారిటీ మాత్రమే…మిగిలిన రౌండ్లలో గాని బీజేపీ పుంజుకుంటే పోరు ఆసక్తికరంగా మారేలా ఉంది. 15 రౌండ్లు ముగిసే వరకు ఫలితం తేలేలా లేదు.

ఇదిలా ఉంటే ఎన్నికల కౌంటింగ్ ఆలస్యంగా జరగడంపై బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నాలుగు రౌండ్ల వెంటనే ప్రకటించారు.. ఐదవ రౌండ్‌కు ఎందుకు లేట్ అయ్యిందని ప్రశ్నించారు. దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయని సందేహం వ్యక్తం చేశారు. అనుభవం లేని అధికారులు కౌంటింగ్ లో ఉన్నారని, అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోందన్న… ఎన్నికల కమిషన్ ఫలితాలను వెంటనే వెబ్ సైట్ లో పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news