ప్రజలు ఎవరికి ఓటు వేసినా సరే.. నా మాట మారదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టం, నష్టం, సంతోషం సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం.
ఏపీలో వైఎస్సార్సీపీ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు.. మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేశ్ కూడా ఘోరంగా ఓడిపోయారు. టీడీపీ ఘోర పరాజయం, తన పరాజయంపై ఎట్టకేలకు నారా లోకేశ్ స్పందించారు.
వరుస ట్వీట్లతో నారా లోకేశ్ విజృంభించారు. కార్యకర్తలకు, నాయకులకు ఆయన ధైర్యం చెప్పారు. ప్రజలు ఎవరికి ఓటు వేసినా సరే.. నా మాట మారదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టం, నష్టం, సంతోషం సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం. నేను మీలో ఒకడిని మీవాడిని అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అదైర్యపడొద్దు. ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. మనకి పార్టీ అండగా ఉంది.. అంటూ ఎన్నికల ప్రచార సమయంలో లోకేశ్ ప్రజలతో కలిసిన ఫోటోలను షేర్ చేశారు. ఇంకా చాలా ట్వీట్లు చేశారు లోకేశ్. అవేంటో మీరే చదవండి..
ఇకపై మరింత బాధ్యతతో పనిచేసి ప్రజలకు చేరువ అవ్వాలి. ఎన్నికలలో మీరు నాకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. pic.twitter.com/uR1FuURfAV
— Lokesh Nara (@naralokesh) May 26, 2019
ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దు. ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. మనకి పార్టీ అండగా ఉంది. pic.twitter.com/xdeNS8ahkz
— Lokesh Nara (@naralokesh) May 26, 2019
ప్రజలు ఎవరికి ఓటువేసినా సరే నా మాట మారదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టం నష్టం, సంతోషం సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం. నేను మీలో ఒకడిని మీవాడిని. pic.twitter.com/Mwln0nPngL
— Lokesh Nara (@naralokesh) May 26, 2019
ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి జరిగేవి, వాటివల్ల అధికార మార్పిడి జరగొచ్చు కానీ మీతో నా అనుబంధాన్ని మార్చలేవు. మంగళగిరి నియోజకవర్గం నా ఇల్లు మీరంతా నా కుటుంబం అని ప్రచారంలో చెప్పింది వట్టి మాటలు కాదు. గడప గడపకు వచ్చాను, గెలిచినా ఓడినా మీతోనే ఉంటాను అని చెప్పాను. pic.twitter.com/oAhzXxYKhl
— Lokesh Nara (@naralokesh) May 26, 2019
వివిధ నియోజకవర్గాల నుంచి అలాగే మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన తెదేపా కార్యకర్తలు, నాయకులను కలుసుకున్నాను. ప్రజల తీర్పు గౌరవించాలని, ఇకపై పార్టీ బలోపేతానికి కలిసి పనిచేద్దామని తెలిపాను. pic.twitter.com/bgG3ZYAJke
— Lokesh Nara (@naralokesh) May 26, 2019