ఇతర రాష్ర్టాల ప్రజలు, ముఖ్యంగా నార్త్ ప్రజలు కూడా వైఎస్సార్సీపీ గురించి, జగన్ గురించి తెలుసుకుంటున్నారు. ఇంతగా మోదీ గాలి వీచినా.. పార్లమెంట్‌లోనూ తనదైన ముద్ర వేసుకొని 22 స్థానాలను దక్కించుకొని జాతీయ స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వైఎస్సార్సీపీ.
మొత్తం మీద ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు మాత్రం క్లీన్ స్వీప్ చేశాయి. ఒకటి వైఎస్సార్సీపీ, రెండు బీజేపీ. వైఎస్సార్సీపీ ఏపీలో ప్రభంజనం సృష్టిస్తే… బీజేపీ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. సో.. దేశ వ్యాప్తంగా ఏపీ మీద, జగన్ మీద, మరోవైపు బీజేపీ మీద ప్రజలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇతర రాష్ర్టాల ప్రజలు, ముఖ్యంగా నార్త్ ప్రజలు కూడా వైఎస్సార్సీపీ గురించి, జగన్ గురించి తెలుసుకుంటున్నారు. ఇంతగా మోదీ గాలి వీచినా.. పార్లమెంట్‌లోనూ తనదైన ముద్ర వేసుకొని 22 స్థానాలను దక్కించుకొని జాతీయ స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వైఎస్సార్సీపీ. దీంతో దేశమంతా జగన్ గురించి తెలుసుకుంటోంది.
ఇక.. వీళ్ల ప్రమాణ స్వీకార విషయానికి వస్తే.. వైఎస్ జగన్, మోదీ.. ఇద్దరూ ఈనెల 30నే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జగన్.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అయితే.. ప్రస్తుతం జగన్ ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. మంత్రివర్గ విస్తరణ కొన్ని రోజుల్లో జరగనున్నట్లు తెలుస్తోంది.
భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రెండో సారి మే 30న రాత్రి 7 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మోదీతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రపతి భవన్‌లో మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. మోదీతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.