నర్సాపూర్ తేలడం లేదు..ఛాన్స్ ఎవరికి?

-

119 సీట్లకు 115 సీట్లు కే‌సి‌ఆర్ తేల్చేశారు. అభ్యర్ధులని ప్రకటించేశారు. దీంతో పెద్ద టాస్క్ అయిందని భావించారు. కానీ అభ్యర్ధులని ప్రకటించని సీట్లలోనే పెద్ద తలనొప్పి కనిపిస్తోంది. మొత్తం నాలుగు సీట్లు కే‌సి‌ఆర్ ప్రకటించలేదు. నాంపల్లి, గోషామహల్, నర్సాపూర్, జనగామ సీట్లు ప్రకటించలేదు. నాంపల్లి, గోషామహల్ సీట్లలో పెద్ద పంచాయితీ లేదు. అవి బి‌ఆర్‌ఎస్‌కు పట్టున్న సీట్లు కూడా కాదు. అవి పక్కన పెడితే..బి‌ఆర్‌ఎస్ కు కంచుకోటలైన నర్సాపూర్, జనగామలతోనే పెద్ద తలనొప్పి.

ఈ రెండు సీట్లలో పోరు ఎక్కువ ఉంది. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్య సీటు పంచాయితీ ఉంది. జనగామ పక్కన పెడితే..నర్సాపూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మధన్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య పంచాయితీ ఉంది. గత రెండు ఎన్నికల్లో మదన్ బి‌ఆర్‌ఎస్ నుంచి గెలిచారు. ఆయనపై కొంత వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన సునీతాకు సీటు ఇస్తారనే ప్రచారం వచ్చింది. కానీ మదన్ సైతం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు.

దీంతో ఈ సీటు పెండింగ్ లో పడింది. ఇద్దరికి నర్సాపూర్ పై పట్టు ఉంది. తాజాగా మదన్..కే‌టి‌ఆర్‌ని కలిశారు..కానీ సీటుపై క్లారిటీ ఇవ్వలేదు. సీటు విషయంపై ఎమ్మెల్యే అనుచరులు కే‌టి‌ఆర్‌ని ప్రశ్నించగా, “తుది నిర్ణయం నాన్నదే అంటూ కే‌టి‌ఆర్ తేల్చి చెప్పేశారు. పార్టీ వద్ద అందరి బలబలాల వివరాలు ఉన్నాయని, తాము ఎల్లప్పుడు మీతోనే ఉంటామని కే‌టి‌ఆర్..మదన్‌కు బదులిచ్చినట్లు తెలిసింది.

దీంతో సీటు అంశం కే‌సి‌ఆర్ వద్దే పెండింగ్ లో ఉంది. అయితే సీటు ఎవరికి వచ్చిన రిస్కే. మదన్‌కు సీటు ఇస్తే సునీత వర్గం సహకరించే పరిస్తితి ఉండదు. ఇటు సునీతాకు సీటు ఇస్తే మదన్ వర్గం సైడ్ అవుతుంది. మొత్తానికి నర్సాపూర్ పంచాయితీ తెగేలా లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version