ఆనాటి వ్యాఖ్యలతో షర్మిలను టార్గెట్ చేసిన నెటిజన్లు….

-

రాజకీయాల్లో కొంత మంది తమ మాటలతో ఎంతటి ఉపద్రవాన్నైనా ఇట్టే కరిగించేస్తారు. కానీ కొంత మంది మాత్రం ప్రత్యర్థుల ఎత్తులకు చిత్తవుతారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాన్చివేత ధోరణితో తెలంగాణ ప్రజలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఏపీలో కూడా ఓడిపోయారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం తాను ఏపీ రాజకీయాల మీదే కాన్సంట్రేట్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు. అప్పుడు ఉమ్మడి రాష్ర్టం కావాలని ధర్నాలు, రాస్తారోకోలు చేసిన వైఎస్. షర్మిల ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించారు. కానీ అప్పడు ఉమ్మడి రాష్ర్టం కోసం షర్మిల చేసిన వ్యాఖ్యలను యాత్రలను ఇప్పడు నెటిజన్లు వెతికి పట్టుకుని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. షర్మిలకు కౌంటర్ వేస్తున్నారు.

నెటిజన్లే కాకుండా షర్మిల రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆనాడు షర్మిల తెలంగాణ కు వ్యతిరేఖంగా చేసిన వ్యాఖ్యలను ర్యాలీలను బయటకు తీసి విమర్శలు గుప్పిస్తున్నారు. షర్మిల ఎప్పటికీ తెలంగాణ బిడ్డ కాదంటూ కౌంటర్ వేస్తున్నారు. సమైఖ్యాంద్ర శంఖారావం పేరిట షర్మిల చేసిన పోరాటాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని అంటున్నారు. అంతే కాకుండా షర్మిల హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ కే ఇవ్వడాన్ని కూడా వ్యతిరేఖించారని గుర్తు చేస్తున్నారు. ఇన్ని విధాలుగా తెలంగాణ కు అన్యాయం చేసిన షర్మిలను ఏనాడు తెలంగాణ వాసులు క్షమించరని చెబుతున్నారు. ఇదిలా ఉండగా షర్మిల మాత్రం తెలంగాణ లో అధికార టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆరోపిస్తున్నారు.

ఆనాడు ఉమ్మడి ఏపీకి మద్దతుగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం తాను తెలంగాణ లో రాజకీయాలు చేయాలని భావించి వచ్చినపుడు తనకు ఇలా అడ్డంకిగా మారుతాయని షర్మిల అస్సలు ఊహించి ఉండదు. కనుకే రాజకీయాలు చేసేవారైనా ఎవరైనా సరే మాట్లాడే ముందు ఆచితూచి వ్యవహరించాని పలువురు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version