హుజూరాబాద్ పోరులో కొత్త ట్విస్ట్‌… కాంగ్రెస్ షాక్ ఎవరికి?

-

ఎట్టకేలకు హుజూరాబాద్ బరిలో నిలబడే టీఆర్ఎస్ అభ్యర్ధి డిసైడ్ అయిపోయారు. విద్యార్ధి దశ నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు కేసీఆర్…హుజూరాబాద్ టికెట్ ఇచ్చారు. బీసీ వర్గానికి చెందిన నేత కావడం, పైగా ఉద్యమ నేపథ్యం ఉన్న నేత కావడంతో శ్రీనివాస్ అయితేనే, ఈటల రాజేందర్‌ని ఢీకొట్టగలరని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

అయితే గెల్లు ఏ మేరకు ఈటలకు పోటీ ఇస్తారనేది ఎన్నికల్లో తేలనుంది. కాకపోతే ఇద్దరు బీసీ వర్గానికి చెందిన నాయకులే కావడంతో, హుజూరాబాద్‌లో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయనేది ఆసక్తికరంగా ఉంది. బీసీల ఓట్లలో చీలిక తప్పనిసరిగా వచ్చేలా కనిపిస్తోంది. అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఎవరిని దింపుతారనేది ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు గెలిచే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు.

కానీ కాంగ్రెస్ ఓట్లు మాత్రం చీల్చి…బీజేపీ, టీఆర్ఎస్‌ల గెలుపు అవకాశాలు మాత్రం దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది. కాకపోతే కాంగ్రెస్ వల్ల ఎక్కువ నష్టపోయేది ఏ పార్టీ అనేది క్లారిటీ రావడం లేదు. కాకపోతే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం. హుజూరాబాద్ బరిలో దళిత వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఒకవేళ దళిత అభ్యర్ధి నిలబెడితే…దళితబంధు వల్ల లబ్ది పొందే దళిత ఓటర్లు కొందరు కాంగ్రెస్ వైపు చూపితే, టీఆర్ఎస్‌కే డ్యామేజ్ జరిగేలా కనిపిస్తోంది. అలా కాకుండా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెడితే అప్పుడు సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్ధి బట్టే టీఆర్ఎస్, బీజేపీల గెలుపు ఆధారపడి ఉందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news