ఓమిక్రాన్ పేరుతో ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

-

ప్రభుత్వం ఓమిక్రాన్ పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని.. కనీసం ప్రతిపక్షాల సమావేశాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ కార్యక్రమాలకు కరోనా రూల్స్ వర్తించవా అంటూ ప్రశ్నించారు.

తాజాగా తన ట్విట్టర్ ద్వారా.. ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘‘మొన్న నకిరేకల్లో TRS సంబరాలకు కోవిడ్ నిబంధనలు వర్తించవు. అవి కేవలం ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే. ఒమిక్రాన్ పేరుతో అందరి గొంతు నొక్కి, అరెస్టులు చేస్తూ ఒక్క KCR ప్రభుత్వం మాత్రం సంబరాలు చేసుకుంటున్నది. మా సభలకు ఆఘమేఘాల మీద అనుమతి నిరాకరించిన పోలీసులు, వీళ్లకెట్ల అనుమతినిస్తున్నరు?’’ అంటూ ప్రశ్నించారు.

ఇదే విషయమై.. కాంగ్రెస్, వైఎస్సార్టీపీ కూడా ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేఖిస్తోంది. కరోనా రూల్స్ ఉన్నా టీఆర్ఎస్ పార్టీ తన కార్యక్రమాలను చేపడుతోందని… తమ పార్టీ కార్యక్రమాలకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ కార్యక్రమాలకు మాత్రం ఎలా అనుమతిస్తున్నారంటూ… కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news