ఓవ‌ర్ టు కాంగ్రెస్ : ఒక క్ష‌మ జీవితాన్ని మారుస్తుందా ?

-

జీవితాల‌ను ఏవి మారుస్తాయి అన్న ప్ర‌శ్న ద‌గ్గర నుంచి చేజారిన క్ష‌ణాల నుంచి రాజీవ్ హ‌త్యోదంతం నుంచి ఇంకా ఇంకొన్నింటి నుంచి ఇంకొంద‌రి నుంచి నేర్చుకోవాల్సిన‌వి ఏంటి? క్ష‌మ జీవితాన్ని మంచి మార్పు దిశ‌గా న‌డిపిస్తే స‌మాజంలో కొన్ని త‌ప్పుల‌కు నియంత్ర‌ణ ఉంటుంది లేదా వివేకం పెరిగి గ‌త కాలంలో జ‌రిగిన త‌ప్పిదాలు మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌ర‌గ‌వు. ఆ విధంగా క్ష‌మ అన్న‌ది ఓ పెద్ద చోద‌క శ‌క్తి అని రాయాలి. లేదా అదే గొప్ప చైత‌న్య గీతిక అని రాయాలి.. మౌన స్వ‌రం క్ష‌మ అయి ఉంటే ఎంత బాగుంటుంది. ఆ విధంగా రాజీవ్ హ‌ద్యోదంతంలో కానీ మిగ‌తా విష‌యాల్లో కానీ సంబంధిత నిందితులు నిర్బంధ కాండ నుంచి స్వేచ్ఛా భార‌తావ‌నిలోకి వ‌చ్చేందుకు కార‌ణం అయిన సంద‌ర్భం ఒక‌టి విన‌వ‌స్తోంది ఇప్పుడు. ఇది క‌దా కావాలి…

రాజ‌కీయాల‌కు అతీతం అయిన సంద‌ర్భాలు మ‌న దేశాన చాలా త‌క్కువ క‌నిపిస్తాయి. వినిపిస్తాయి. న‌డుస్తున్న చ‌రిత్ర‌లో న‌మోదుకు నోచుకుని ఉంటాయి. ఆ విధంగా  పేరారివాళన్-కు ద‌క్కిన క్ష‌మ గురించి (రాజీవ్ హ‌త్య కేసు నిందితుడు) ఇంకా ఇంకొంద‌రికి ద‌క్కిన క్ష‌మ గురించి చెబుతున్న తీరే గొప్ప‌ది. అంటే.. ఆయా సంద‌ర్భాల్లో వారిని ఉద్దేశించి, వారికి కోర్టు వాకిట క్ష‌మ ద‌క్కే విధంగా ప‌నిచేసిన వారంతా కూడా కాస్తో కూస్తో విచ‌క్షణ‌కు ప్రాధాన్యం ఇచ్చిన వారే క‌దా! అంటే విచక్ష‌ణ, క్ష‌మ అన్న గుణాలే కీల‌కం అయి ఉన్నాయి.. ఇవాళ ! రేప‌టి వేళ కూడా అవే కీలకం అయి ఉంటాయి కూడా !

ప్రేమ నిండిన క‌ళ్లు, కృత‌జ్ఞ‌త నిండిన హృద‌యం గొప్ప మార్పున‌కు కార‌ణం అయి ఉంటాయి. ఎప్ప‌టిదో ఆ కేసు రాజీవ్ హ‌త్య కేసు. ఆ హ‌త్యోదంతంకు సంబంధించిన నిందితుల‌కు క్ష‌మాభిక్ష పెట్ట‌మ‌ని అడిగిన‌వారంతా  గొప్ప‌వారు. తెలియక చేశారా ఆ త‌ప్పు తెలిసి చేశారా ఆ త‌ప్పు అన్న‌ది ఇప్పుడిక అన‌వ‌స‌ర చ‌ర్చ.. అన్న‌ది సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల మాట. ఓ లాయ‌రు (పేరు : ర‌వికాంత్ రెడ్డి.ఎం) కూడా ఈ విధంగానే అన్నారు. solitary confinement అన్న‌ది ఏ విధంగా ఉంటుంది. తెలుగులో ఒంటరి జైలు జీవితం ఇదెలా ఉంటుంది అని.. ! ఎలా ఉంటుంది అంటే న‌ర‌కానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది.. న‌రకానికి న‌క‌లు రూపంలో ఉంటుంది. ఆ విధంగా ఆ యువ‌కుడు అంటే రాజీవ్ హ‌త్యోదంతంలో ఇరుక్కున్న వాడు (ఉద్దేశం ఆపాదిత‌మా లేదా అనువ‌ర్తిత‌మా అన్న‌ది త‌రువాత) పెరారి వాళన్ ఇప్పుడు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. సీఎం స్టాలిన్ ను క‌లిశాడు.

అస‌లు ఆ లేఖ ఇచ్చిందే ప్రియాంక గాంధీ అని అంటున్నారే ! వావ్ ! ఎంత గొప్ప మ‌న‌సు ! క‌నుకనే వాళ్లు గెలిచినా ఓడినా ఈ సంద‌ర్భంలో కొన్ని బాధిత వ‌ర్గాల‌కు ఇలాంటి చ‌ర్య‌లు ఓ ఊర‌ట !  Congress party never believe in violence nor capital punishment!! అన్న మాట కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఓ నెటిజన్ ఈ మాట‌ను ప్ర‌స్తావించారు. ఏదేమ‌యినా క్షమ జీవితాల‌ను మారుస్తుంది అని చెప్ప‌డంలో ఎంద‌రో ద‌య లేదా ప్రేమ భిక్ష‌గా దొరికిన చాలు అని అనుకోవ‌డంలో ఉన్న సంతృప్త‌త, దొరికాక పొందే ఆనంద‌పు అవ‌ధి చాలా గొప్ప‌వి ! వాటి ద‌గ్గ‌ర మనం అంతా చిన్న‌వారం. లేదా ఏమీ తెలియ‌న వాళ్లం. లాయ‌రు ర‌వికాంత్ రెడ్డి, మ‌రో నెటిజ‌న్ జ్యోతి రాఘ‌వ్  రెడ్డికి, ఇంకా ఇంకొంద‌రికి కొన్ని మంచి విష‌యాలు చెప్పేందుకు ఈ ఒక్క ఉదంతం ఓ కార‌ణం అయి ఉంది. ఆ విధంగా ప్రియాంక‌పై మ‌రియు ఇంకొంద‌రు కాంగ్రెస్ అగ్ర నేత‌ల‌పై సాఫ్ట్ కార్న‌ర్ పెరిగింది కూడా ఈ ఉద‌యాన !

– ఎక్జిక్యూష‌న్ : ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి 

Read more RELATED
Recommended to you

Latest news