రాజధాని విషయంలో కేంద్ర బిజెపి నేతలు ఒకరకంగా, రాష్ట్ర బిజెపి నేతలు ఒకరకంగా మాట్లాడుతున్నారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తాజాగా రాజధాని ప్రాంతంలో మీడియాతో మాట్లాడిన ఆయన బిజెపిపై సునిసిత విమర్శలు చేసారు. రెండు మాటలు మాట్లాడవద్దని సూచించారు పవన్ కళ్యాణ్. మోడికి, బిజెపికి సంబంధం లేదని ఆయన ప్రధాని కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోలేరని అన్నారు.
రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వాలకు పరిమితులు ఉంటాయని పవన్ అన్నారు. బిజెపి నేతల మాటల వలన రెండు అర్ధాలు వస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వానికి టీడీపీ నేతల మీద కోపం ఉంటే వారి మీద తీర్చుకోవాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని హితవు పలికారు. పోలీసులను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారని, భారీ మెజారిటీతో అధికారం ఇస్తే ప్రజలను రోడ్ల మీదకు ఈడ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని బిజెపి నేతలకు తాను స్పష్టంగా చెప్పా అన్నారు పవన్ కళ్యాణ్. మూడు రాజధానులకు కేంద్రం ఏ విధంగా కూడా మద్దతు ఇవ్వలేదని, వాళ్ళు అసలు దీనికి అనుకూలం కాదన్నారు. వైసీపీ నాయకులు చెప్తున్నట్టు గా కేంద్రం మద్దతు ఇవ్వలేదని, ఇది ఇప్పటికే నిర్ణయించిన అంశం కాబట్టి దాంట్లో వాళ్ళు జోక్యం చేసుకునే అవకాశం లేదని పవన్ అభిప్రాయపడ్డారు.
అయితే రాజకీయ పోరాటం ఉంటుందని, భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందన్నారు పవన్ కళ్యాణ్. కేంద్రానికి పరిమితులు ఉంటాయన్న ఆయన, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటాయని, ఆ అధికారం వాళ్లకు ఉందని, కాబట్టి ఈ విషయంలో రాజకీయ పోరాటమే మార్గం గాని మరొకటి లేదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు.