కేసీఆర్ ద్వారా జగన్ ను దగ్గర చేసుకునే ఆలోచనో పవన్…?

Join Our Community
follow manalokam on social media

తెలంగాణలో ఇప్పుడు జనసేన పార్టీ రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం టిఆర్ఎస్ పార్టీ ని దగ్గర చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని కొంత మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆయన వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. ఈ నాలుగు సినిమాలు కూడా 2, 3 ఏళ్ళ లోపు విడుదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాస్త జాగ్రత్తగానే ముందుకు వెళ్తున్నారు. హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ ఆయన సినిమాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటే అనేక ఇబ్బందులు పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం కూడా ఉండవచ్చు. ముఖ్యమంత్రి జగన్ పై ఆయన విమర్శలు చేస్తున్నారు. జనసేన పార్టీ నేతలు కూడా ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు కాబట్టి సీరియస్ గా ముందుకు వెళితే పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడవచ్చు అయితే తెలంగాణ లో సీఎం కేసీఆర్ తో స్నేహం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ ను కూడా దగ్గర చేసుకునే ప్రయత్నం పవన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...