జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే సీటు ఏదో దాదాపు తేలిపోయింది. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేస్తారో పార్టీ వర్గాల నుంచి క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో ఎక్కడైతే పోటీ చేసి ఓడిపోయారో అక్కడే పోటీ చేసి గెలవాలని పవన్ చూస్తున్నారని, ఈ క్రమంలోనే ఆయన భీమవరం బరిలోనే దిగుతున్నారని తేలిపోయింది. ఎలాగో టిడిపి-జనసేన పొత్తు ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలతో బిజేపి కలుస్తుందా? లేదా? అనేది తర్వాత అంశం.
ఇక టిడిపి, జనసేన పొత్తులో సీట్ల లెక్కలపై చర్చలు మొదలయ్యాయి. జనసేనకు టిడిపి ఎన్ని సీట్లు ఇస్తుందో త్వరలో తేలనుంది. అయితే ఎన్ని సీట్లు ఇస్తే అన్నీ సీట్లలో టిడిపి ఓట్లు తమకు పడేలా చూసి, తాము అన్నీ సీట్లు గెలవాలని పవన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల టూర్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. జూన్ 14 నుంచి పవన్ పర్యటన ఉన్న విషయం తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే..పవన్ మాత్రం భీమవరంలోనే పోటీ చేస్తారని తెలుస్తుంది. టిడిపితో ఎలాగో పొత్తు ఉంటుంది కాబట్టి ఒక సీటులోనే పవన్ బరిలో దిగుతున్నారు.
దీంతో పవన్ ఈ సారి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అంచనాలు వస్తున్నాయి. అదే సమయంలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సీటు సైతం ఫిక్స్ అయిపోయింది. తెనాలి నుంచే తాను పోటీ చేస్తానని చెప్పేశారు. ఇక్కడ టిడిపి నుంచి ఆలపాటి రాజా ఉన్నారు. ఇక చంద్రబాబు తన భవిష్యత్ చూసుకుంటారని రాజా తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలో తెనాలి సీటు నాదెండ్లకే ఫిక్స్. అందులో ఎలాంటి డౌట్ లేదు.
అయితే గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి దాదాపు 17 వేల ఓట్లతో ఓడింది. నాదెండ్లకు 30 వేల ఓట్ల వరకు పడ్డాయి. ఇప్పుడు టిడిపి సపోర్ట్ ఉండటంతో తెనాలిలో నాదెండ్ల గెలుపు సులువే.