పవన్‌కు వాలంటీర్ల సెగలు..జీవితంలో ఎమ్మెల్యే అవ్వలేరట.!

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్..తాజాగా వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ వాలంటీర్లుగా పనిచేస్తున్నవారు..వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్. అసలు వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు అని ఆ పార్టీ నేతలే చెప్పారు. సరే ఏదైతే ఏముంది వారు ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరవేస్తున్నారు. అదే సమయంలో వాలంటీర్లు ప్రజలు వైసీపీ వైపే ఉండేలా పనిచేస్తున్నారు. లోకల్ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు పోతాయని చెప్పిన వాలంటీర్లు ఉన్నారు.

కానీ ఇవన్నీ ప్రతిపక్ష టి‌డి‌పి చేసే విమర్శలు..అయితే ఇప్పుడు పవన్ ఊహించని విమర్శలు చేశారు. రాష్ట్రంలో కొందరు మహిళలు మిస్ అవ్వడానికి కారణం వాలంటీర్లు అని, వైసీపీ కనుసన్నల్లో పనిచేస్తున్న వాలంటీర్లు..ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు…మహిళలు ఎంతమంది ఉన్నారు..వితంతవులు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని ఆ సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని ఆరోపించారు. ఒంటరి మహిళలే వాలంటీర్ల టార్గెట్ అని, దీనికి సంబంధించి కేంద్రంలోని ఓ అధికారం తనకు సమాచారం ఇచ్చారని అన్నారు.

ఇక పవన్ ఆరోపణలపై వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అటు మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ..పవన్ కు సమాచారం అందించిన ఆ అధికారి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. బి‌జే‌పి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలు మిస్ అవ్వడం లేదా? అని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే మహిళా కమిషన్ పవన్‌కు నోటీసులు జారీ చేయగా, వరుసగా వాలంటీర్లు పవన్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.అటు వైసీపీ నేతలు పవన్‌ని యథావిధిగానే తిడుతున్నారు. జీవితంలో ఎమ్మెల్యే అవ్వలేరంటూ ఫైర్ అవుతున్నారు. తక్షణమే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్‌కు సిగ్గు శరం లేదని, రాజకీయాల్లో ప్యాకేజ్ స్టార్ట్‌గా మిగిలిపోతారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news