జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల అటు రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో ఓ టీమ్ ఓట్ల గురించి తెలుసుకుంటూ అధికార పార్టీ కాకుండా వేరే పార్టీ పేరు చెబితే ఓట్లు గల్లంతవుతున్నాయని.. ఈ సర్వే చేస్తున్న వారిని పట్టుకుని సోషల్ మీడియా వేదికగా బాధితులు వారి బండారం బయటపెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇదంతా అధికార పార్టీ చేయిస్తోందని కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
తాజాగా.. ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..” చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగ్‌లు గురించి వింటాం. ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులను ఇప్పుడు చూస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు దీని గురించి ఏమి మాట్లాడతారా? అని నేను ఎదురు చూస్తున్నాను. మా పార్టీ నేతలు త్వరలోనే ఈ వ్యవహారంపై ఓ నిర్ణయం తీసుకొని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయబోతున్నాము” అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ జాతీయ పత్రికలో పబ్లిష్ అయిన వార్త కటింగ్‌ను పవన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఓట్లెత్తుకెళ్లే గ్యాంగులు – టిడిపిపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో విమర్శలు
-