పవన్ ప్లాన్ చేంజ్..ఊహించని స్టెప్.!

-

రాజకీయంగా జనసేనని నిలబెట్టడానికి పవన్ రంగంలో దిగారు. టి‌డి‌పి, వైసీపీలు హోరాహోరీగా రాజకీయ యుద్ధానికి తెరలేపడం..అందులో జనస్నేయ వెనుకబడి ఉంది. అసలు తెరపైనే కనబడటం లేదు. ఎందుకంటే పవ్న్ యాక్టివ్ పాలిటిక్స్ చేయకపోవడం..ఏదో అప్పుడప్పుడు మాత్రమే రాష్ట్రానికి రావడంతో జనసేన వెనుకబడింది. అనుకున్న విధంగా రేసులో నిలబడలేదు. ఒకవేళ రేసులో ఉండుంటే..పొత్తులో భాగంగా టి‌డి‌పిని సీట్లు గట్టిగానే డిమాండ్ చేయవచ్చు.

కానీ ఆ పరిస్తితి కాస్త తక్కువ కనిపిస్తుంది. అయితే అలాంటి పరిస్తితి నుంచి బయటపడేయడానికి పవన్ రంగంలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 14 నుంచి పవన్ ప్రజల్లోకి రానున్నారు. వారాహి బస్సుతో యాత్ర చేయనున్నారు. దీంతో జనసేనకు కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఓ వైపు చంద్రబాబు, మరో వైపు లోకేష్ టి‌డి‌పి కోసం తిరిగేస్తున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ప్రజల్లో ఉంటున్నారు. జగన్ భారీ సభలతో ప్రజల్లో ఉంటున్నారు. ఈ తరుణంలో పవన్ సైతం ప్రజల్లోకి వచ్చేస్తున్నారు. అదే సమయంలో జనసేనని బలోపేతం చేసే దిశగా స్కెచ్ వేయనున్నారు.

అయితే పవన్ ఊహించని ఆలోచనతో ముందుకొస్తున్నారు. జూన్ 14 నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గంలో యాత్ర మొదలుపెడతారు. నెక్స్ట్ పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్‌, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగిస్తారు. ఈ నియోజకవర్గాలు అన్నీ జనసేనకు పట్టున్న స్థానాల్లో..వీటిల్లో జనసేన బలం మరింత పెంచి..పొత్తులో భాగంగా తీసుకోవాలని చూస్తున్నారు.

అదే సమయంలో నెక్స్ట్ పొత్తు ఉంటే జనసేన ఓట్లు టి‌డి‌పికి వెళతాయి గాని..టి‌డి‌పి ఓట్లు జనసేనకు పూర్తి స్థాయిలో పడతాయో లేదో గ్యారెంటీ లేదు. అందుకే దాదాపు సొంతం బలం పెంచుకుని గెలిచేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన పర్యటించే స్థానాల్లో జనసేనకు ఆధిక్యం తీసుకురావాలని చూస్తున్నారు. చూడాలి మరి పవన్ యాత్ర జనసెంకు ఎంతవరకు ప్లస్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news