గ్రామాలు, మహిళల అభివృద్ధి కోసం జగన్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దానిలో భాగంగానే ఆయన మహిళలకు వరాల జల్లు ప్రకటించారు.
అధికారంలోకి వచ్చి నెల కూడా కాలేదు కానీ.. ఏపీ సీఎం జగన్ మాత్రం అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన పాలన కొత్తగా, అందరికీ నచ్చేలా ఉండటంతో ఏపీ ప్రభుత్వం మరింత చురుకుగా ముందడుగు వేస్తోంది. మిగితా ముఖ్యమంత్రుల్లా కాకుండా.. తనదైన శైలిలో వినూత్నంగా ముందుకువెళ్తున్నారు.
గ్రామాలు, మహిళల అభివృద్ధి కోసం జగన్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దానిలో భాగంగానే ఆయన మహిళలకు వరాల జల్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్.. ఇవాళ తొలిసారిగా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో ఆయన కీలక ప్రకటన చేశారు.
ఉగాది పండుగ రోజులన ఏపీలోని అన్ని గ్రామాల్లో మహిళలందరికీ 25 లక్షల ఇంటి పట్టాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.
తర్వాత 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు 75 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండో ఏడాది నుంచి ఈ డబ్బును మహిళకు అందించనున్నట్లు తెలిపారు. నాలుగేళ్లలో ఏడాదికి 75 వేలు చొప్పున ప్రతి మహిళకు అందించనున్నట్లు జగన్ హామీ ఇచ్చారు.
ఇక.. ఇంటి పట్టాల కోసం అధికారులు సమాయత్తం కావాలని జగన్ అన్నారు. ఇంటి పట్టాల కోసం భూమి అందుబాటులో లేకపోతే కొనుగోలు చేయాలని.. ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు వాళ్ల జాగ ఎక్కడుందో కూడా లబ్ధిదారులకు చూపించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉగాది రోజున ఏపీలో గ్రామగ్రామాన సంబురాలు అంబరాన్ని తాకాలని జగన్ స్పష్టం చేశారు.