పవన్ పరిస్థితి జగనన్న ఇళ్లు.. పవన్, చంద్రబాబు కన్నీళ్లు లాగా ఉంది : జోగి రమేష్‌

-

విజయనగరం పర్యటనకు వెళ్లిన పవన్ అక్కడ అసలు ఏం చేసినట్లు అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. పవన్‌ పర్యటనపై మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పరిస్థితి చూస్తుంటే జగనన్న ఇళ్లు.. పవన్, చంద్రబాబు కన్నీళ్లు లాగా ఉందని ఎద్దేవా చేశారు. ఆయన పర్యటనలకు ఈ ట్యాగ్ లైన్ పెట్టుకోవడం బెటర్ అని సూచించారు జోగి రమేష్ . విజయనగరం పర్యటనకు వెళ్లిన పవన్ అక్కడ అసలు ఏం చేసినట్లు అని ప్రశ్నించారు జోగి రమేష్. పవన్ మాటలు, చేష్టలు వింతగా ఉన్నాయన్నారు జోగి రమేష్. పిల్ల సైకోలను పోగేసుకుని వచ్చి గుంకలాంలో మీటింగ్ పెట్టారు జోగి రమేష్. లబ్ధిదారులు తిరగబడితే ఈ పిల్ల సైకోలు పరుగెత్తుతున్నారు జోగి రమేష్.

జనాల్ని రెచ్చగొట్టి హైదరాబాద్ పారిపోవటం తప్ప ఇక ఏం చేస్తున్నావ్?. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం ఏ రాష్ట్రంలోనూ జరగటం లేదు జోగి రమేష్. కేంద్ర ప్రభుత్వమే శభాష్ అని మెచ్చుకున్నదని తెలుసుకో. మనసున్న ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి వస్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారో, మెచ్చుకుంటున్నారో తెలుస్తుంది. పవన్, ఆయన దత్తతండ్రి కలిసొచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు జోగి రమేష్. రాక్షసులు, దుర్మార్గులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పేదల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం. అసలు ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తారో చూసుకో. నువ్వు ఎక్కడెక్కడ పోటీ చేయాలో అది చూసుకో. గెలుస్తావో లేదో అది కూడా చూసుకో పవన్ అని సూచించారు జోగి రమేష్.

 

Read more RELATED
Recommended to you

Latest news