ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది.మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా ఏడుసార్లు గెలిచిన ఆయన ఎనిమిదోసారి అక్కడి నుంచి పోటీచేశారు.భారీ మెజారిటీతో గెలుస్తామని చంద్రబాబు చెప్తుండగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం బాబు ఓటమి పక్కా అంటున్నారు.గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గెలిచారు.అయితే ఇప్పుడు మాత్రం ఆయన ఓడిపోవడం ఖాయమని పెద్దిరెడ్డి ధీమాగా ఉన్నారు.అక్కడ వైసీపీ తరపున పోటీ చేసిన భరత్ గెలుస్తాడని అంటున్నారు.అసలు పెద్దిరెడ్డి ఉంటే ధీమాగా ఉండటానికి కారణం ఎంటోగాని ఈ మాట విన్న చంద్రబాబుకి మాత్రం భయాందోళన వెంటాడుతోంది.
మే 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగింది.ముఖ్యంగా చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలో గతం కంటే ఓట్లు ఆధికంగా పోల్ అయ్యాయి. వైసీపీ తరపున ఎమ్మెల్సీ భరత్ బరిలో దిగారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయనతో పాటు సీఎం జగన్,మరో నలుగురు మంత్రులు, లక్ష్మీ పార్వతి వంటి ప్రముఖులు కుప్పంలో భరత్ తరపున ప్రచారం చేశారు.
దీంతో ఎప్పుడూ లేనంతగా ఓటర్లు బారులు తీరి మరీ ఓట్లు గుద్దారు.ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంతో గెలుపుపై సానుకూలత వ్యక్త పరుస్తున్నారు చంద్రబాబు.ఈసారి అత్యధిక మెజారిటీ రావడం పక్కా అంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో 89.88శాతం ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 2,02,920 ఓట్లు పోల్ కాగా మహిళలు 01,01,608 మంది,పురుషులు 01,01,306 ఇతరులు 6 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
2019 ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ కింద మహిళలకు నగదు పంపిణీ చేశారు చంద్రబాబు. అప్పుడు మహిళలు ఎక్కువమంది ఓట్లు వేశారు.దీంతో పసుపు కుంకుమ బాగా వర్కవుట్ అవుతుందని ధీమాగా చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో మహిళలు వైసీపీకి పట్టం కట్టారు. అదేతరహాలో ఇప్పుడు కూడా మహిళలు అధిక సంఖ్యలో ఓట్లు వేశారు. ఇప్పుడు కూడా టీడీపీ గెలుపు ఖాయమని చంద్రబాబు చెప్తుండగా పెద్దిరెడ్డి మాత్రం బాబుకి అంత సీన్ లేదని అంటున్నారు.
సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు మహిళలకు లబ్ది చేకూర్చాయని అందుకే వాళ్ళు ఫ్యాన్ గుర్తుపై గంపగుత్తగా ఓట్లు గుద్దారని పేర్కొన్నారు. అంతేకాదు చంద్రబాబు ఖాతాలో ఉన్న 35వేల నకిలీ ఓట్లను తొలగించారు.అందుకే ఈసారి మాత్రం చంద్రబాబు ఓటమిని ఎవ్వరు ఆపలేరని పెద్దిరెడ్డి చెప్తున్న మాట.జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఆరోజు ఎం జరుగుతుందనేది ఓటర్లకు ఆసక్తిగా మారింది.