కేంద్రం లో ఉన్న మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పేద మధ్య తరగతి ప్రజలు చస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నసమయంలో పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. అందులో భాగంగానే రాహుల్ గాంధీ ప్రధాని మోడీ పై ఆగ్రహాం వ్యక్తం చేశారు. గంగా నది లో మునగటానికి ఉత్తర ప్రదేశ్ కు ప్రధాని మోడీ చాలా సార్లు వస్తారని అన్నారు.
కానీ ఒక్క సారి కూడా ఉత్తర ప్రజల సమస్య లను పరిష్కరించడానికి చర్యలు తీసుకోలేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దేశం లో నిరుద్యోగుల సంఖ్య విపరీతం గా పెరిగి పోయిందని విమర్శించారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో బీజేపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని అన్నారు. పేద ప్రజలకు ఎలాంటి సాయం చేయాలరని విమర్శించారు. సాగు చట్టాలు రైతుల మేలు కోసమే అంటూ చెప్పి.. చివరికి వాటిని రద్దు చేసి రైతులకు క్షమాపణలు చేప్పారని అన్నారు. అలాగే అమేథీ ప్రజలు తనకు రాజకీయ పాఠాలు నేర్పారని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఆమేథీ లో అడుగు పెట్టారు.