పేర్ని పంచులు…ఎమ్మెల్యేలకు టెన్షన్!

-

సాధారణంగా గోదావరి జిల్లాల వాళ్ళకు కాస్త వెటకారం ఎక్కువగా ఉంటుందని అంటుంటారు…అయితే గోదావరికి పక్కనే ఉన్న కృష్ణా జిల్లా వాళ్ళకు కూడా వెటకారం ఏ మాత్రం తక్కువ కాదని మాజీ మంత్రి పేర్ని నాని ఎప్పుడు నిరూపిస్తుంటారు…అసలు ఆయన మాటలే పంచులు మాదిరిగా ఉంటాయి…పూర్తిగా వెటకారంగా ప్రతిపక్షాలపై సెటైర్లు వేస్తూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు ఈయన కనబడకుండా సొంత పార్టీపై కూడా కాస్త సెటైర్లు వేస్తూ ఉంటారు. కాకపోతే పేర్ని నాని పంచులు అర్ధం చేసుకోవడం చాలా కష్టం…అర్ధమైతే మాత్రం అందులో చాలా పరమార్ధం ఉంటుంది.

తాజాగా వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో పేర్ని తన దైన శైలిలో పేర్ని ప్రత్యర్ధులపై పంచులు వేసి…వైసీపీ శ్రేణులని ఉత్సాహపరిచారు. పనిలో పనిగా సొంత పార్టీపై కూడా ఈయన కనబడకుండా కొన్ని పంచులు వేసేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వస్తూంటారు పోతూంటారు…కానీ వైసీపీలో శాశ్వతం జగన్, కార్యకర్తలు మాత్రమే అన్నారు. అంతఎందుకు మొన్నటివరకు తాను మంత్రి అని, కానీ ఇప్పుడు మాజీని అని చెప్పుకొచ్చారు…అలాగే తమకు జగన్ కొన్ని నెలల సమయం ఇచ్చారని, ఈలోపు పనితీరు మెరుగు పరుచుకుపోతే ఎమ్మెల్యే సీట్లు కూడా ఉండవని పరోక్షంగా తమ పార్టీ ఎమ్మెల్యేలకు హింట్ ఇచ్చారు.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని పలు సర్వేల్లో తెలుస్తోంది…కాబట్టి ఎన్నికల్లోపు ఆ వ్యతిరేకత పోగొట్టుకుని ప్రజా మద్ధతు పెంచుకోకపోతే నెక్స్ట్ ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వనని జగన్ చెప్పేశారు…అదే విషయాన్ని పేర్ని కాస్త తన స్టైల్ లో చెప్పుకొచ్చారు. నెక్స్ట్ కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు కూడా ఉండవని పరోక్షంగా చెప్పేస్తున్నారు. ఏదేమైనా పేర్ని పంచులకు అర్ధాలే వేరులే అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news