విపక్షాలకు శరద్ పవార్ షాక్..?

ప్రెసిడెంట్ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. జూలై 18న భారత దేశ రాష్ట్రపతి ఎన్నికల జరగనుంది. అయితే ఇప్పటికే ఎన్డీయే, యూపీఏ కూటములతో పాటు ఏ కూటమిలో లేని ప్రతిపక్షాలు తమతమ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. రేపు ఢిల్లీలో మమతా బెనర్జీ ప్రతిపక్షాల మీటింగ్ పిలుపునిచ్చారు. ప్రెసిడెంట్ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ మీటింగ్ సాగనుంది. ప్రతిపక్షాలు అంతా కలిసి ఉమ్మడి ప్రెసిడెంట్ అభ్యర్థిని నియమించే ప్రయత్నాల్లో ఉన్నారు. 

ఇదిలా ఉంటే ప్రతిపక్షాల అభ్యర్థిగా ముందుగా వస్తున్న పేరు ఎన్సీపీ నేత శరద్ పవార్ ది. ఆ తరువాత మాజీ స్పీకర్ మీరాకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి నుంచి కేరళ గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ తో పాటు ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళి సై పేర్లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ప్రతిపక్షాల తరుపును ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్ పేరు వినిపిస్తున్నా.. తాను రాష్ట్రపతి ఎన్నికల పోటీలో లేనని శరద్ పవార్ పార్టీ నేతలతో అన్నట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి ముంబైలో ఎన్సీపీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజం అయితే ప్రతిపక్షాలకు షాక్ తగిలినట్లే.