తిరుపతిలో మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేస్తారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోన్న అంశం. తిరుపతిలో జనసేన పార్టీకి అనుకూలంగా పరిస్థితులు కనపడుతున్నాయి. అయినా సరే భారతీయ జనతాపార్టీ ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో జనసేన పార్టీ కాస్త ఇబ్బందిగా ఉంది. అయితే జనసేన పార్టీ నేతలు ఎంత వరకు సహకరిస్తారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. కానీ ఇక్కడ మాత్రం చిరంజీవి పోటీ చేసే అభ్యర్ధికి ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది.
భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కోరడంతో చిరంజీవి వారం రోజుల్లో ప్రచారానికి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. వాస్తవానికి 2009లో చిరంజీవి ఎమ్మెల్యేగా తిరుపతి నుంచి విజయం సాధించారు. అప్పుడు చాలా మంది నేతలు ఆయనకు సహకరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా ఇక్కడ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి చిరంజీవి ప్రచారం చేస్తే బీజేపీకి ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు ఉంటాయి.
అందుకే ఇప్పుడు చిరంజీవితో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడ ప్రచారం చేసే అవకాశం ఉండకపోవచ్చు. జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టుకుండా బీజేపీ కట్టడి చేయడంతో పవన్ కళ్యాణ్ ప్రచారానికి దూరంగా ఉన్నారని అయితే బీజేపీ అగ్రనేతలు చర్చలు జరపడంతో చిరంజీవి ప్రచారానికి వెళ్ళ వచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి చిరంజీవి ప్రచారం ఎప్పుడు చేస్తారో చూడాలి.