గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాజీనామా

-

గోవా సీఎం ప్రమోద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గోవాలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే తన పదవీకాలం ముగుస్తుండటంతో సీఎం పదవికి ప్రమోద్ సావంత్ రాజీనామా చేశారు. పనాజీలో గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై కి తన రాజీనామా లేఖను అందించారు. అయితే కొత్తగా  ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని గవర్నర్ సూచించారని సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించారు. 4 రాష్ట్రాల్లో ప్రమాణ స్వీకారం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని… కేంద్ర పరిశీలకులు వచ్చిన తర్వాతే శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి తేదీలను నిర్ణయిస్తామని ప్రమోద్ సావంత్ తెలిపారు. తమకు మహాారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ( ఎంజీపీ) మద్దుతు ఇచ్చారని వెల్లడించారు. 

ఇటీవల వెల్లడైన గోవా ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీ సాధించింది. మొత్తం 40 స్థానాలకు ఎన్నికలు జరిగితే.. 20 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ కు కేవలం ఒకే స్థానం దూరంలో నిలిచింది. మరోవైపు మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. ముగ్గురు ఇండిపెండెంట్లు గెలిచారు. కాంగ్రెస్ 11 స్థానాల్లో, ఆప్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news