విడదల రజిని అవినీతి..ప్రత్తిపాటి చెప్పడమే వెరైటీ.!

-

మంత్రి విడదల రజిని టార్గెట్ గా టి‌డి‌పి సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గత కొన్ని రోజులుగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆమె చిలకలూరిపేటలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా కూడా అదే స్థాయిలో విమర్శలు చేశారు.  రజిని అవినీతి చిట్టాకు లెక్కే లేదని.. ఇంకా ఎంత దోచుకుంటారో తెలియదని,  మంత్రి విడదల రజిని ఆరోగ్యశాఖను పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు.

ఇక ఆస్పత్రుల్లో కనీసం మందులు కూడా అందుబాటులో ఉండట్లేదని,  మంత్రి అవినీతిపై రాష్ట్రం మొత్తం కోడై కూస్తోందని, చిలకలూరిపేట మున్సిపాలిటీని అవినీతికి అడ్డాగా మార్చారని ఫైర్ అయ్యారు. పనులు చేయకుండానే రూ.2.70 కోట్ల బిల్లులు చేసుకున్నారని, అటు మున్సిపల్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది మొత్తం మంత్రి కుటుంబీకులేనని, ఆరోపించారు. ఇలా పెద్ద ఎత్తున రజిని టార్గెట్ గా ప్రత్తిపాటి ఆరోపణలు గుప్పించారు. అయితే గతంలో టి‌డి‌పి అధికారంలో ఉండగా ప్రత్తిపాటి మంత్రిగా ఉండేవారు. అప్పుడు ప్రత్తిపాటిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇసుకలో దోపిడి జరిగిందని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అలాంటి నేత ఇప్పుడు రజినిపై కావాలని విమర్శలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

అయితే గత ఎన్నికల్లో రజిని..ప్రత్తిపాటిపై పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.తొలిసారి ఎన్నికల బరిలో దిగి ప్రత్తిపాటిని రజిని ఓడించారు. అలాగే అనూహ్యంగా ఆమె ప్రజా మద్ధతు పెంచుకుంటూ వచ్చారు. రెండో విడతలో మంత్రి అయ్యారు. మంత్రిగా అద్భుతంగా పనిచేస్తున్నారు.

ఇక ఈ సారి ఎన్నికల్లో కూడా ఆమె..వైసీపీ నుంచి పేటలో పోటీ చేస్తున్నారు. ఇటు టి‌డి‌పి నుంచి ప్రత్తిపాటి పోటీ చేయనున్నారు. ప్రస్తుత సర్వేలు రజినికి అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ ఆమెకే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version