సిద్దిపేటలో 23 మార్చి 1968న జన్మించిన రఘునందన్ రావు , సిద్దిపేట డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివారు. హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన ఆయన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బెయిల్ పిటిషన్‌ను పరిష్కరించడంలో మంచి పేరు తెచ్చుకున్నారు.
2001లో టీఆర్ఎస్లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావుకు సన్నిహితుడిగా పేరుగాంచిన రఘునందన్ టీడీపీతో సన్నిహితంగా మెలుగుతున్నారనే ఆరోపణలతో 2013లో టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు.
ఆ తర్వాత బీజేపీలో చేరి 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుని దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తెలంగాణలో భాజపా అధికార ప్రతినిధిగా, ఆయన పార్టీ తరపున చర్చల్లో పాల్గొంటూ టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తుంటారు. 2014 మరియు 2018 ఎన్నికలలో రెండుసార్లు విఫలమయ్యాడు కానీ 2020లో జరిగిన దుబ్బాక ఉపఎన్నికలలో MLA గా విజయం సాధించాడు.